Monday, April 29, 2024

భార్య, ఇద్దరు మగ పిల్లలకు విషమిచ్చి చంపి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Suicide

 

హైదరాబాద్ ఎల్‌బినగర్‌లో
ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అఘాయిత్యం

మన తెలంగాణ/మన్సూరాబాద్ : ఎల్బీనగర్ హస్తినాపురంలో విషాద కరమైన సంఘటన చోటు చేసుకు ంది. భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఓ సాఫ్ట్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హస్తినాపురం నార్త్ సంతోష్‌మాత కాలనీలో గత ఆరేళ్లుగా నివాసం ఉంటున్నారు. ఎల్బీనగర్ పోలీసులు ,స్దానికుల కధనం ప్రకారం …. నల్గొండ జిల్లా దేవరకోండ మండలం నేరెడుగోమ్మ గ్రామానికి చెందిన కోట్ర ప్రదీప్ కూమార్ (36) ఐబిమ్ కంపెనీలో సాఫ్ట్ ఇంజనీర్‌గా చేస్తున్నాడు. ప్రదీప్ కూమార్‌కు నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కోండరెడ్డి పల్లి గ్రామానికి చెందిన స్వాతి (29)తో వివాహం జరిగింది. వీరిద్దరికి ఇద్దరు మగ పిల్లలు కళ్యాణ్ కృష్ణ (6) ,జయకృష్ణ (2) ఉన్నారు. శనివారం రాత్రి భార్య స్వాతి ,కళ్యాణ్ కృష్ణ ,జయకృష్ణకు ఆహరంలో విషం కలిపి ఇచ్చాడు.

వారు మృతి చెందిన అనంతరం రోజంతా వారి శవాల వద్ద ఉన్నాడు ప్రదీప్ .అ తర్వాత ప్రదీప్ తాను విషం తీసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. వారు శనివారం ఇంటి నుంచి బయటికి రాలేదని స్దానికులు చెబుతున్నారు. ప్రదీప్ బంధువులు ఫోన్ చేసినప్పుటికి ఎంతకీ స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారమందించారు. దీంతో ఎల్బీనగర్ పోలీసులు ఘటనాస్థలిని సందర్శించారు. పోలీసులకు నలుగురు వి గత జీవులుగా కనిపించారు.మృతదేహలను పోస్టుమార్టం నిమి త్తం ఉ స్మానియా ఆసుపత్రికి తరిలించారు. గత రెండేళ్ల క్రితం వీరు హస్తినాపుర ం సంతోషిమాత కాలనీలో ఇల్లు నిర్మించుకున్నారు.ఆర్థిక ఇబ్బందులే కారణం కావొచ్చన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

నాన్నకు లేఖ రాసిపెట్టి ….
ప్రదీప్ ఆత్మహత్య చేసుకునే ముందు తన తండ్రికి లేఖ రాశాడు. నీకు భారం కాలేనంటూ ఈ లేఖలో పేర్కొన్నాడు. నాన్న నన్ను క్షమించు …నేను నిన్ను విడిచి పెట్టి పోతున్నా … నా పిల్లలు నీకు భారం కావొద్దని వారిని తీసుకెళ్తున్నా… నిన్ను పోషించే వయస్సులో ఇబ్బందులకు గురి చేస్తూ వెళ్తున్నా … నన్ను క్షమించు అంటూ లేఖలో ప్రదీప్ పేర్కోన్నాట్లు ప్రదీప్ తండ్రి చెప్పాడు. ఈ లేఖను స్వాధీనం చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.అతని బావమరిది సతీష్ కూమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Man commits Suicide by Poisoning his Wife two Children
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News