Monday, April 29, 2024

కాబూల్ ఎయిర్‌పోర్టులో పేలుళ్లు

- Advertisement -
- Advertisement -
Explosion at Kabul airport kills 18
18 మంది దుర్మరణం
విమానాశ్రయం వద్ద, సమీప హోటల్ వద్ద జంట పేలుళ్లు
ముగ్గురు అమెరికన్ సైనికులు సహా పలువురికి గాయాలు
ఆత్మాహుతి దాడే : అమెరికా

కాబూల్: అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని హ మిద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటన లో 18మంది మరణించారు. అఫ్ఘన్‌నుంచి విదేశా లు తమ దేశ పౌరులను తరలిస్తున్న వేళ గురువా రం సాయంత్రం ఈ పేలుళ్లు సంభవించాయి. ఒక పేలుడు కాబూల్ విమానాశ్రయం ప్రవేశ ద్వారం వద్ద సంభవించగా, దగ్గర్లోని హోటల్ సమీపంలో మరో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. విమానాశ్రయం వద్ద జరిగిన పేలుడు ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని అమెరికా రక్షణ విభాగం భావిస్తోంది. ఈ పేలుడు వెనుక ఇస్లామిక్ స్టేట్ గ్రూపు (ఐసిస్) హస్తముండవచ్చని తాము బలంగా నమ్ముతున్నట్లు అమెరికా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే ఆయన తన పేరు వెల్లడించడానికి మాత్రం ఇష్టపడలేదు.

అంతేకాదు తాలిబన్లకన్నా ఐసిస్ ఎక్కువ రాడికల్ అని, గతంలో కూడా పౌరులను లక్షంగా చేసుకుని అనేక దాడులు జరిపిందని కూడా ఆయన చెప్పారు. ఈ పేలుళ్లలో 18 మంది మరణించగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో అమెరికా భద్రతా దళాలకు చెందిన ముగుగ్రు కూడా గాయపడినట్లు సమాచారం. ఇది కచ్చితంగా ఆత్మాహుతి దాడేనని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. కాబూల్ విమానాశ్రయానికి సమీపంలో మరో హోటల్ వద్ద కూడా పేలుడు సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. రెండు పేలుళ్లతో విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో గంభీర వాతావరణం నెలకొంది. రక్త మోడుతున్నప్పటికీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆస్పత్రికి పరుగులు పెడుతున్న క్షతగాత్రుల దృశ్యాలు బయటికి వచ్చాయి. కాబూల్ విమానాశ్రయం వెలుపల ఆత్మాహుతి దాడులు జరగవచ్చని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా మొదటినుంచీ అనుమానిస్తున్నాయి.

దీనికి సంబంధించి అమెరికా రక్షణ శాఖ గురువారం ఉదయమే హెచ్చరించింది కూడా. కాబూల్ విమానాశ్రయం వద్ద ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని, అందువల్ల తక్షణమే విమానాశ్రయాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన తమ దేశ పౌరులను హెచ్చరించారు కూడా. ఈ హెచ్చరికలు వెలువడిన కొద్ది గంటలకే ఈ పేలుళ్లు సంభవించడం గమనార్హం. పేలుడు ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు పెంటగాన్ అధికారులు సమాచారమిచ్చారు. కాగా అఫ్ఘన్‌లో భద్రతా పరిస్థితిపై బైడెన్ భద్రతా అధికారులతో సమావేశమవుతున్నారు.

ఆత్మాహుతి దాడే!

కాగా ఒక పేలుడు విమానాశ్రయంలోని అబ్బే గేటు సమీపంలో సంభవించగా, మరో పేలుడు దగ్గర్లోని బరోన్ హోటల్ సమీపంలో సంభవించినట్లు పెంటగాన్ అధికారులు తలిపారు. ఈ రెండు పేలుళ్లలో ఒకటి తప్పకుండా ఆత్మాహుతి దాడి అయి ఉంటుందని కూడా వారు చెప్పారు. కాగా ఈ పేలుళ్లలో కనీసం 13 మంది మృతిచెందారని తాలిబన్ ఉగ్రవాది ఒకరు చెప్పారు. మృతుల్లో పిల్లలు కూడా ఉన్నారని, చాలామంది తాలిబన్ గార్డులు కూడా గాయపడ్డారని ఆయన చెప్పారు. కాబూల్ విమానాశ్రయం ప్రవేశ ద్వారం వద్ద సంభవించగా, దగ్గర్లోని హోటల్ సమీపంలో మరో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. విమానాశ్రయం వద్ద జరిగిన పేలుడు ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని అమెరికా రక్షణ విభాగం భావిస్తోంది. ఈ పేలుడు వెనుక ఇస్లామిక్ స్టేట్ గ్రూపు (ఐసిస్) హస్తముండవచ్చని తాము బలంగా నమ్ముతున్నట్లు అమెరికా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే ఆయన తన పేరు వెల్లడించడానికి మాత్రం ఇష్టపడలేదు.

అంతేకాదు తాలిబన్లకన్నా ఐసిస్ ఎక్కువ రాడికల్ అని, గతంలో కూడా పౌరులను లక్షంగా చేసుకుని అనేక దాడులు జరిపిందని కూడా ఆయన చెప్పారు. ఈ పేలుళ్లలో 48 మంది మరణించగా, 120మంది గాయపడ్డారు. ఈ దాడిలో అమెరికా భద్రతా దళాలకు చెందిన నలుగురు మెరెన్లు మరణించగా, మరికొందరు క్షతగాత్రులయ్యారు. ఇది కచ్చితంగా ఆత్మాహుతి దాడేనని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. కాబూల్ విమానాశ్రయానికి సమీపంలో మరో హోటల్ వద్ద కూడా పేలుడు సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. రెండు పేలుళ్లతో విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో గంభీర వాతావరణం నెలకొంది. రక్త మోడుతున్నప్పటికీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆస్పత్రికి పరుగులు పెడుతున్న క్షతగాత్రుల దృశ్యాలు బయటికి వచ్చాయి. కాబూల్ విమానాశ్రయం వెలుపల ఆత్మాహుతి దాడులు జరగవచ్చని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా మొదటినుంచీ అనుమానిస్తున్నాయి.

దీనికి సంబంధించి అమెరికా రక్షణ శాఖ గురువారం ఉదయమే హెచ్చరించింది కూడా. కాబూల్ విమానాశ్రయం వద్ద ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని, అందువల్ల తక్షణమే విమానాశ్రయాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన తమ దేశ పౌరులను హెచ్చరించారు కూడా. ఈ హెచ్చరికలు వెలువడిన కొద్ది గంటలకే ఈ పేలుళ్లు సంభవించడం గమనార్హం. పేలుడు ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు పెంటగాన్ అధికారులు సమాచారమిచ్చారు. కాగా అఫ్ఘన్‌లో భద్రతా పరిస్థితిపై బైడెన్ భద్రతా అధికారులతో సమావేశమవుతున్నారు.
కాగా ఒక పేలుడు విమానాశ్రయంలోని అబ్బే గేటు సమీపంలో సంభవించగా, మరో పేలుడు దగ్గర్లోని బరోన్ హోటల్ సమీపంలో సంభవించినట్లు పెంటగాన్ అధికారులు తలిపారు. ఈ రెండు పేలుళ్లలో ఒకటి తప్పకుండా ఆత్మాహుతి దాడి అయి ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News