Saturday, April 27, 2024

ఎం.పి.హెచ్ కోర్సు ప్రవేశాల ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు పెంపు

- Advertisement -
- Advertisement -

Extension of online application deadline for MPH course

 

ప్రకటించిన కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎం.పి.హెచ్(మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) కోర్సు ప్రవేశాల కొరకు ఆన్‌లైన్ ధరఖాస్తుల గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కాళోజి హెల్త్ యూనివర్సిటీ బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. నవంబరు 4వ తేది వరకు ఉన్న తుది గడువు ఈనెల 6వ తేది వరకు పొడిగించినట్లు విసి డా కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే నవంబరు 10వ తేదిన మాత్రం పరీక్ష యధావిధిగా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.

ఇదిలా ఉండగా కాళోజి హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఎంబిబిఎస్, బిడిఎస్ అడ్మిషన్లకు ఇప్పటి వరకు 6వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆయన విసి తెలిపారు. ఇదిలా ఉండగా రా్రష్ట్ర వ్యాప్తంగా 4800 మెడికల్ సీట్లతో పాటు ఈడబ్లుఎస్‌లో 190 సీట్లు ఉన్నాయి. వీటిలో 1500 సీట్లు ప్రభుత్వ కాలేజీల్లో, 2750 ప్రైవేట్, మైనార్టీల్లో మరో 550 సీట్లు ఉన్నాయి. దీంతో పాటు 13 డెంటల్ కాలేజీల్లో మరో 1340 సీట్లు ఉన్నాయని విసి వెల్లడించారు. అయితే ఆల్ ఇండియా కోటలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు సర్టిఫికేట్లు అప్లోడ్ చేయకపోతే నాట్ క్వాలిఫైడ్‌గా గుర్తించనున్నట్లు ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News