Saturday, April 27, 2024

హైదరాబాద్‌కు మరో మణిహారం

- Advertisement -
- Advertisement -

Minister KTR Allow Permission for Steel Skywalk At Mehdipatnam

హైదరాబాద్: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పకడ్భందీ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఇప్పటికే దుర్గంచెరువును అందంగా పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రభుత్వం తీర్చిదిద్దింది. అక్కడ కేబుల్ బ్రిడ్జిని నిర్మించి నగరానికి మణిహారంలా మార్చింది. దీంతోపాటు హైదరాబాద్‌లో మరో స్కైవాక్‌ను అందుబాటులోకి ప్రభుత్వం తీసుకురానుంది. ఇప్పుడు అలాంటి స్టీల్ వంతెనను మెహిదీపట్నంలో నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెహిదీపట్నం వద్ద పాదాచారుల కోసం స్కై వాక్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ రద్దీని తట్టుకునేలా దీనిని నిర్మిస్తున్నారు. ఈ స్కై వాక్ నిర్మాణానికి మంత్రి కెటిఆర్ ఆమోదం తెలిపినట్టు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ ట్వీట్ చేశారు.

త్వరలోనే ఈ నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అక్కడున్న బస్ షెల్టర్‌ను రీడిజైన్ చేయనున్నారు. పాదాచారుల స్కైవాక్ 500 మీటర్ల పొడవునా స్టీల్‌తో నిర్మించనున్నారు. మొత్తం 16 లిఫ్ట్‌లను ఏర్పాటు చేయనుండగా, అందులోని రెండు లిఫ్ట్‌లను రైతుబజార్‌లో ఏర్పాటు చేయనున్నారు. కరోనా పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడితే ఐటి నిపుణులు వర్క్‌ఫ్రం హోం నుంచి ఆఫీసులకు వెళ్లి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా ఇలాంటి చర్యలకు శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం గచ్చిబౌలి వైపు ఐటి కంపెనీలకు వెళ్లే వారికి ఇదే ప్రధాన మార్గం కావడంతో ప్రభుత్వం ప్లై ఓవర్లు, స్టీల్ బ్రిడ్జీలు, స్కై వాక్‌ల నిర్మాణానికి చర్యలు చేపడుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News