Saturday, May 4, 2024

గ్రీన్ టీ ద్వారా బరువు తగ్గడానికి శాస్త్రీయ ఆధారం లేదు

- Advertisement -
- Advertisement -

No scientific basis for weight loss through green tea

హైదరాబాద్: అధిక శరీర బరువుతో బాధపడే స్దూలకాయులు తమ శరీరపు అదనపు బరువును దించుకునేందుకు తమకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక సలహాను పాటించేందుకు ఉత్సాహం చూపుతారని అపోలో వైద్యులు డా. రవిశంకర్ ఇరుకులపాటి పేర్కొన్నారు. గ్రీన్‌టి అధికంగా వినియోగించడం కూడా ఇందులో ఒక భాగమేనని, శరీరంలోని అదనపు బరువును తగ్గించడంలో గ్రీన్ టి బాగాఉపయోగపడుతుందని ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒక నమ్మకం, స్దూలకాలయులు తగిన పరిమాణంలో గ్రీన్‌టి వినియోగంచడంతో తమ శరీరంలోని అదనపు బరువు తగ్గుతుందనే బలమైన ఆధారం లేదన్నారు.అనేక వారాలు ,నెలలపాటు అనేకపర్యాయాలు గ్రీన్‌టిని అధికా మోతాదులో తాగడం అది శరీరంపై ఏదో విధంగా మూత్రపిండాలు, ఇతర అవయవాలపై దుష్ఫ్రభావం చూపిస్తుందన్నారు.

శరీర బరువు తగ్గించుకునేందుకు గ్రీన్‌టిని ఉపయోగించగా,అది వారి కిచెన్‌లో కొన్ని కేజీల గ్రీన్ టీ తరిగిపోతుంది,కానీ వారి శరీరంలో బరువుకాదు అని సూచించే ఒక మీమ్ బాగా ప్రాచుర్యాన్ని పొందిందన్నారు. అయితే అన్ని గ్రీన్‌టిలు ఇదే కోవకు చెందినదికావన్నారు. ఆరోగ్య కరమైన,సమతుల్యమైన,తక్కువ కేలరీలు కలయికలున్న డైట్‌తో పాటు తగిన శరీర వ్యాయామం,మంచి నిద్ర వంటి ఇతర జీవనశైలి మార్పులతో ,శాస్త్రీయ పద్దతితో దీర్ఘకాలం పాటు సరైన నిపుణుల పర్యవేక్షణలో శరీర బరువు కోల్పోయే లక్షాలను సాధికారికంగా సాధించవచ్చన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News