Wednesday, May 1, 2024

మహిళను మింగిన ఆర్వోబీ గొయ్యి

- Advertisement -
- Advertisement -

Falling into the ditch The woman died

రక్షణ చర్యల లోపంతోనే ప్రమాదమని బాధితుల ఆరోపణ

చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట బంగారు మైసమ్మ చౌరస్తాలో ఆర్వోబీ విస్తరణ కోసం తీసిన గోతిలో పడి ఒక యాచకురాలు మృతి చెందింది. తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవటంతో ఒక మహిళ బలైంది. మొన్న మిధాని ప్రాంతంలో జరుగుతున్న ఆర్వోబీ పనులలో ఒక ఘటన చోటుచేసుకోగా తాజాగా మరో సంఘటన చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో వెలుగు చే సింది. పోలీసుల కథనం ప్రకారం… మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్ కొండ మండలం, బూర్గుపల్లి గ్రామానికి చెందిన పి. భారతమ్మ (36) ఆ గ్రామానికి చెందిన మరికొంత మందితో కలిసి భిక్షాటన కోసం హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట ప్రాంతానికి వచ్చింది.

శివరాత్రి, షబ్ ఏమేరాజ్ పండగలు ముగియటంతో వ చ్చిన వారు తమ ఇళ్ళకు చేరుకోగా భారత మ్మ రాలేదు. దీంతో ఆమె బంధువులు బి.రమేష్, లక్ష్మయ్య, శాంతమ్మలు కలిసి భారతమ్మ కో సం చాంద్రాయణగుట్ట ప్రాంతంలో వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం బంగారు మైసమ్మ దేవాలయం, యాక్సిస్ బ్యాంకు సమీపంలో ఆర్వోబీ కోసం తీసిన పెద్ద గోయి వద్ద ఆమె బ్యాగు కనిపించింది. అనుమానం వచ్చిన వారు గోతిలో పరీక్షించగా చెత్తా చెదారం, నీటి మధ్య ఆమె మృతదేహం తెలియాడటం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వెంకటేష్ సిబ్బంది అక్కడికి చేరుకొని భారతమ్మ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. బంధువు బి. రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News