Saturday, April 27, 2024

ఎంఆర్ఓ కార్యాలయం ముందు రైతు ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/పెంట్లవెల్లి: మండల కేంద్రానికి చెందిన కురువ నాగన్న ఎంఆర్ఓ కార్యాలయం ముందు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నానానికి పాల్పడ్డాడు. కార్యాలయం ముందు ఉన్న కొంతమంది వ్యక్తులు ఆయనను అడ్డుకున్నారు. తనకు 658 సర్వే నెంబర్లు గల ఒక ఎకరా 28 గుంటల భూమి కలదని ఆరోగ్యం బాగోలేక ఇదే గ్రామానికి చెందిన ఆర్‌ఎంపి డాక్టర్ మల్లయ్య దగ్గరికి వెళ్ళడం జరిగిందని చదవురాని నాతో టెస్టులు చేయించాలని మందుల పేపర్లో సంతకం పెట్టించుకుని అక్రమంగా ఒక ఎకరా 28 గుంటలు భూమిని అతని పేరుపై పట్టా చేయించుకున్నాడని బాధితుడు కురువ నాగన్న తెలిపారు. గతంలో పెద్దమనుషుల సమక్షంలో మూడు లక్షల రూపాయలు ఇచ్చి ఇకపై భూమి దరిదాపు కూడా రాను అని చెప్పడం జరిగింది. మళ్ళి ఇప్పుడు కోర్టు నుంచి నోటీసులు ఇప్పిస్తున్నారు. మమల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని ఎన్నిసార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయిందని అందుకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నానని తెలిపారు. ఆర్‌ఎంపి డాక్టర్ మల్లయ్య గతంలో కూడా గోపాలపురం గ్రామానికి చెందిన రంగారెడ్డి అనే వ్యక్తి దగ్గర కూడా దొంగ సంతకం పెట్టించుకొని కోటి రూపాయల ఆస్తిని తన పేర చేయించుకున్నాడని ఇప్పటికైన రెవెన్యూ శాఖ స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
Farmer attempt suicide at Pentlavelli MRO Office

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News