Saturday, April 27, 2024

బండికి ‘రైతు దెబ్బ’

- Advertisement -
- Advertisement -

Farmers depressing Bandi Sanjay on grain purchases

యాసంగి ధాన్యం కొనుగోలుపై బండి సంజయ్‌ని నిలదీసిన రైతులు

రైతుల పట్ల బిజెపి నాయకుల అసహనం, కర్రలతో దాడి
బండి కాన్వాయ్‌పై కోడిగుడ్లు విసిరిన రైతులు

కేంద్రం వైఖరి చెప్పకుండా
బిజెపి డ్రామాలు ఆడుతున్నదని
విమర్శ
ప్లకార్డులు, వరికంకులతో
నిరసనలు ఆర్జాలబావి,
శెట్టిపాలెంలో తీవ్ర ఉద్రిక్తత
ఆవేదనతో బండి సంజయ్
కాన్వాయ్‌పై టమాటాలు
విసిరిన వైనం
రైతుల తిరుగుబాటుతో
వెనుతిరిగిన బిజెపి నేతలు

మన తెలంగాణ/నల్లగొండ/హైదరాబాద్ : కడుపు రగిలిన అన్నదాతలు తమ ఆగ్రహమెట్లుంటదో కమలనాథులకు రుచిచూపించారు. ఆరుగాలం కష్టపడి పండించి వడ్లను కొనబోమంటూ మెలికపెట్టిన బిజెపి ప్రభుత్వానికి తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. యాసంగిలో వ డ్లు కొంటరో…కొనరో చెప్పకుండా రాజకీయ డ్రామాలేంటని నిలదీశారు. కట్టలుతెంచుకున్న ఆవేశంతో తిరగబడ్డారు. సో మవారం బిజెపి రాష్త్ర అధ్యక్షులు బండి సంజయ్ నల్లగొండ జిల్లాలో ఐకెపి కేంద్రాల్లో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లను పరిశీలించేందుకు వచ్చారు. నల్లగొండ పట్టణంలోన ఆర్జాలబావి, వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం వద్ద బండి సంజయ్, ఇతర బిజెపి రాష్త్ర, జిల్లా నాయకులకు రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. బండి సంజయ్‌తో పాటు బిజెపి రాష్త్ర నాయకులు మనోహర్‌రెడ్డి,ప్రేమేందర్‌రెడ్డి, రాఖేష్‌రెడ్డి, కంకనాల శ్రీధర్‌రెడ్డి వందలాది మంది కార్యకర్తలతో కలిసి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించేందుకు వెళ్లారు. ఆర్జాలబావి వద్ద ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.

రోజుకు 20 లారీల మేరకు ధాన్యం కాంటవేసి మిల్లులకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో బిజెపి నాయకులు మార్కెట్‌కు వచ్చారు. వానకాలంలో కేసీఆర్ వడ్లను పూర్తిగా కొనుగోలు చేస్తమని చెప్పి కొంటున్నారు. అయితే యాసంగి నుంచి కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయబోదని ప్రకటించిన విషయం గురించి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ధాన్యపు రాశులు కాంటాల వద్దకు వచ్చిన బండి సంజయ్‌తో పాటు పలువురు బిజెపి నాయకుల్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ని లదీశారు. మా పొలాల్లో వడ్లు తప్ప మరే పంటలు పండవని, అలాంటి పరిస్థితిలో కేంద్రం వడ్లు కొనుగోలు చేయకపోతే రైతుల పరిస్థితి ఏం కావాలంటూ పలువురు యువ, మహిళా రైతులు బిజెపి నాయకుల్ని తమ వద్ద కు రావొద్దంటూ అడ్డుకున్నారు. వందలాది మంది రైతులతో పాటు టిఆర్‌ఎస్‌కు చెందిన పలువురు కార్యకర్తలు కూడా రైతుల పక్షాన మార్కెట్‌కు వచ్చారు. బిజెపి నేతల ప ర్యటనను వ్యతిరేకిస్తూ నల్లజెండాలు, ఫ్లకార్డులు, వరికంకుల్ని చేతబూని నిరసన వ్యక్తం చేశారు.

తెలంగాణలో ఆరేండ్లుగా ధాన్యం కొనుగోలు చే స్తున్నందున్నే రైతులు బాగుపడుతున్నారని, యాసంగి నుంచి కేంద్రం అసలే ధాన్యం కొనుబోమని చెప్పడం ఏమిటని పలువురు టిఆర్‌ఎస్ శ్రేణులు రైతుల పక్షాన డిమాండ్ చేశారు. వందలాది మంది రైతులు నిలదీయడంతో ఏం చేయాలో పోలుపోని పరిస్థితిలో కొందరు బిజెపి నాయకులు అసహనంతో రైతులపైకి దాడికి పూనుకున్నారు. ప్రశ్నించిన రైతులి దుర్బాషలాడడమే కాకుం డా కర్రలతో దాడి చేసేందకు పరుగులు తీశారు. ధాన్య ధ్వంసం చేశారు. మార్కెట్‌లో నానా రభస సష్టించారు. దీంతో టిఆర్‌ఎస్‌కు చెందిన పలువురు కార్యకర్తలు రైతులపై దాడి చేయడం ఏమిటని నిగ్గదీశారు. కొందరు రైతులు బిజెపి వైఖర్ని తపుపడుతూ కోడిగుడ్లు విసిరారు. చెప్పులు పైకెత్తి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. పరస్పరం వాగ్వివాదంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు జోక్యం చేసుకుని చెదరగొట్టారు. నల్లగొండ మార్కెట్‌లో చేదు అనుభవం ఎదురవ్వడంతో అక్క డి నుంచి బండి సంజయ్‌తో పాటు బిజెపి నాయకులు మిర్యాలగూడకు బయలు దేరారు.

నల్లగొండలో రైతులపై బిజెపి వాళ్లు చేసిన దాడి సంఘటన సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో మిర్యాలగూడ పర్యటనకు రా వద్దంటూ రైతులు, టిఆర్‌ఎస్ మద్దతుదారులు పెద్ద ఎత్తున కుక్కడం, శెట్టిపాలెం వద్ద మహాతేజ రైస్‌మిల్ వద్ద బైఠాయించారు. అక్కడ కూడా నల్లజెండాలు, వరికంకులు, ప్లకార్డుల్ని చేతబూనిన రైతులు బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సంజయ్ కాన్యాయి అక్కడికి చేరుకోగానే రోడ్డుపైకి వచ్చిన రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించే వరకు తమ వద్దకు రావద్దంటూ నిరసన తెలిపారు. అప్పటికే నల్లగొండలో విసుగుచెందిన బిజెపి నాయకులు రైతుల పైకి రాళ్లు విసిరారు. రైతులపై దాడి చేయడంతో చుట్టుపక్కల ఉన్న టిఆర్‌ఎస్ అభిమానులు అక్కడికి చేరుకుని బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట జరిగింది. బిజెపి వాళ్లు విసిరిన రాళ్లు తగిలి కొందరు రైతులకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని లాఠీ చార్జీ చేసి చెదరగొట్టారు. అనుమతి తీసుకున్న దాని కంటే ఎక్కువ మందిని వెంటవేసుకుని బిజెపి నాయకులు పర్యటించడాన్ని పోలీసులు సైతం జీర్ణించుకోలేదు. రైతులు నిరసన తీవ్రమవ్వడంతో చేసేదేమిలేక బండి సంజయ్ తన పర్యటనను వాయిదా వేసుకుని వెనుతిరిగారు.

దమ్ముంటే మోడీతో ప్రకటన చేయించు : టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు

బండి సంజయ్‌కి దమ్ముంటే యాసంగిలో తెలంగాణలో పండిన వడ్లను కొనుగోలు చేస్తామని ప్రధాని మోడీ చేత ప్రకటన చేయించాలని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, బాస్కర్‌రావు డిమాండ్ చేశారు. బిజెపి నాయకులు రైతులపై దాడి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. వారు మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్‌కి ఎంత ధాన్యం పట్టిస్తె ఎన్ని బియ్యం వస్తాయనే కనీస జ్ఞానం కూడా లేదన్నారు. పచ్చి అబద్ధ్దాలను ప్రచారం చేసి పబ్బంగడుపుకోవాలని చూస్తున్నాడని విమర్శించారు. పంజాబ్ ఇతర రాష్ట్రాలలో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణలో మాత్రం ఎందుకు షరతులు పెడుతుందో ఎంపీగా బండి సంజయ్ పార్లమెంట్‌లో మోడీని నిలదీసే దమ్ముందా అని ప్రశ్నించారు.

రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించి కోటి ఎకరాల్ని సాగులోకి తెచ్చేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ గురించి బండి సంజయ్ నోరుపడేసుకోవడం మానుకోవాలన్నారు. లేని పక్షంలో టిఆర్‌ఎస్ శ్రేణులు సైతం బూతులు మాట్లాడితే బిజెపి నాయకులు తట్టుకోలేరన్నారు. రైతులకు మద్దతుగా నల్లగొండలో సుంకరి మల్లేష్‌గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, పీఎసీఎస్ చైర్మన్లు నాగరత్నం రాజు, సంపత్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు అభిమన్యు శ్రీను, అబ్బగోని రమేష్, పోలెబోయిన శ్రీనివాస్, పున్న గణేష్, నాగార్జున, వెంకట్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి మార్కెట్‌కు వెళ్లి రైతుల్ని పరామర్శించారు.

బిజెపి శ్రేణులు, రైతులు, టిఆర్‌ఎస్ శ్రేణులు పోటాపోటీ నినాదాలు చేశారు. రహదారిపై బైఠాయించి బిజెపి శ్రేణు లు ఆందోళనకు పూనుకోగా.. రైతులు, టిఆర్‌ఎస శ్రేణు లు నల్లబ్యాడ్జీలు, నల్ల జెండాలతో నిరసనకు దిగారు. బండి సంజయ్‌కు రైతులు, టిఆర్‌ఎస్ శ్రేణులు 20 మీటర్ల దూరం కూడా లేకపోవడం అక్కడి పరిస్థితి రణక్షేత్రంగా మారిందనేందుకు అద్దం పట్టింది. ఈ క్రమంలో రైతులు, టిఆర్‌ఎస్ శ్రేణులు నల్ల జెండాలతో నిరసన చేపట్టి కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. ఆగ్రహించిన బిజెపి శ్రేణులు ఎదురుదాడికి పాల్పడ్డారు. అనంతరం సూర్యాపేట జిల్లా నేరెడుచర్ల మం. చిల్లెపల్లిలో బండి సంజయ్ పర్యటన కొనసాగుతుండగా మార్గంలో రైతు లు, టిఆర్‌ఎస్ శ్రేణులు నిరసనకు దిగారు. మూసీ వంతెనపై బైఠాయించి రైతులు, టిఆర్‌ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. బండి సంజయ్ వెనక్కి వెళ్లాలని రైతులు, టిఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు.

అర్జాలబావి ఐకేపీ కేంద్రాన్ని బండి సంజయ్ సందర్శిస్తుండగా రైతులు, టి ఆర్‌ఎస్ కార్యకర్తలు నల్ల జెండాలు ప్రదర్శిస్తూ నిరసన తె లిపారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ రైతులు, టిఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతులు, టిఆర్‌ఎస్ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. రైతులు, టిఆర్‌ఎస్ శ్రేణులపైకి దూసుకెళ్లేందుకు బిజెపి శ్రేణులు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని బిజెపి శ్రేణులు నినాదాలు చేశారు. ఐకెపి కేంద్రంలో రైతులు, టిఆర్‌ఎస్ శ్రేణులుబిజెపి శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ ఉద్రిక్తతల నడుమనే ఐకెపి కేంద్రంలో ని ధాన్యం రాశులను బండి సంజయ్ పరిశీలించారు. సూర్యాపేట జిల్లాలోని చిల్లేపల్లి వద్ద భారీగా మోహరించి న రైతులు,టిఆర్‌ఎస్ కార్యకర్తలు తమ కాన్వాయ్‌పై రా ళ్లతో దాడికి దిగారని బిజెపి ఆరోపిస్తోంది. దీంతో బండి సంజయ్ కాన్వాయ్‌లోని కారు అద్దాలు ధ్వంసమయ్యాయని చెప్పారు.

రాళ్లదాడితో పోలీసులు బందోబస్తుతో చిల్లేపల్లి నుండి సంజయ్ కాన్వాయ్‌ను తీసుకెళ్లారు. ఇదే సందర్భంలో బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం సమస్య పరిష్కరించకుండా తప్పుదోవ పట్టిస్తోందని, బాధ్యత మరిచి ప్రవర్తిస్తోందని ఆరోపించారు. దృష్టి మరల్చేందుకు భయానక వాతావరణం సృష్టించాలని చూస్తే బిజెపి భయపడే ప్రసక్తి లేదన్నారు. టిఆర్‌ఎస్ కా ర్యకర్తలే రైతుల్లాగా వచ్చి గొడవలు చేస్తున్నారని ఆరోపించారు. వానాకాలంలో మొత్తం పంటను ప్రభుత్వం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. పంటలన్నీ కేంద్రం కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. రైతుల కోసం రాళ్ల దాడికి సిద్ధమేనని ప్రకటించారు. 60 లక్షల టన్నులు కొనాలని ఎఫ్‌సిఐతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. ఏడు లక్షల టన్నులే కొన్నట్లు రాష్ట్ర ప్రభుత్వమే చెబుతోంది, మరి మిగతా పంట ఎప్పుడు కొంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు రైతులు, టిఆర్‌ఎస్ శ్రేణులు ధాన్యం కొనుగోలుపై అదే సమయంలో వాగ్వాదానికి దిగారు. యాసంగి వడ్లు కొంటామని ప్రధాని మోడీతో ప్రకటన చేయించాలని, ధాన్యం సేకరణపై బిజెపి స్పష్టమైన వైఖరిని చెప్పాలంటూ రైతులు, టిఆర్‌ఎస్ కార్యకర్తలు నినదిస్తూ ధర్నా, ఆందోళనకు దిగడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసినట్లయింది.

తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి బిజెపి, టిఆర్‌ఎస్‌ల మధ్య గత కొంతకాలంగా రాజకీయ వేడి కొనసాగుతోంది. ఇప్పటికే ఇరు పార్టీలు పోటాపోటీగా ధర్నాలు నిర్వహించిన సంగతి విదితమే. మరోవైపు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇరు పార్టీల అగ్రనేతలు సైతం పరస్పర ఆరోపణలకు దిగుతున్న విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News