Saturday, May 4, 2024

దేశవ్యాప్త నిరసనలకు రైతు సంఘాల పిలుపు

- Advertisement -
- Advertisement -

Farmers protest live updates

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో పదవరోజు అన్నదాతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఎముకలు కొరికే చలిలోనూ వేలాదిమంది రైతులు ధర్నా చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మరోమారు రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరపనుంది. ఇప్పటికే రైతు సంఘాలతో కేంద్రం పలుసార్లు చర్చలు జరిపింది. సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణను తిరస్కరించిన రైతులు నూతన చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతున్నలు డిమాండ్ చేస్తున్నారు. నేడు దేశవ్యాప్తంగా ప్రధాని దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం దిగిరాకపోతే ఈ నెల 8న భారత్ బంద్ నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి.

Farmers protest live updates

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News