Friday, May 10, 2024

గాలి కాలుష్యానికి రైతుల్ని నిందించిన వాళ్లు క్షమాపణ చెప్పాలి

- Advertisement -
- Advertisement -
Farmers shouldn't be blamed for air pollution Says Tikait
బికెయు నేత రాకేశ్‌టికాయత్

ఘజియాబాద్: గాలి కాలుష్యానికి రైతుల్ని నిందించినవాళ్లు క్షమాపణ చెప్పాలని భారతీయ కిసాన్ యూనియన్(బికెయు) నేత రాకేశ్‌ టికాయత్ డిమాండ్ చేశారు. గాలి కాలుష్యానికి రైతుల్ని నిందించొద్దని ఆయన హితవు పలికారు. రైతులు వ్యర్థాల్ని తగులబెట్టడం గాలి కాలుష్యానికి 10 శాతంమేర మాత్రమే కారణమని, రైతుల్ని బాధ్యుల్ని చేయొద్దని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడాన్ని టికాయత్ గుర్తు చేశారు. ఢిల్లీలో గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కెఎం)లో బికెయు భాగస్వామ్య పక్షం. జాతీయస్థాయి రైతు ఉద్యమంలో టికాయత్ కీలక నేతగా ఎదిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News