Saturday, May 4, 2024

ఫాస్టాగ్‌కు లింక్ కావాల్సిందే.. గడువు పొడిగించం

- Advertisement -
- Advertisement -

FASTag deadline won't be extended: Gadkari

 

రవాణాశాఖమంత్రి నితిన్ గడ్కరీ

నాగ్‌పూర్: ఫాస్టాగ్‌కు గడువు పొడిగించేది లేదని కేంద్ర రవాణాశాఖమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. వాహన యజమానులు వెంటనే ఫాస్టాగ్‌ను తీసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే రెండు,మూడుసార్లు గడువు పొడిగించినందున ఇక పొడిగించబోమని ఆయన తేల్చి చెప్పారు. ఈ నెల 15 అర్ధరాత్రితో ఫాస్టాగ్ గడువు ముగియనుండగా, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాహనదారులు టోల్‌ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్ విధానంలో ఫీజులు చెల్లించే ఫాస్టాగ్ పద్ధతిని 2016లోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వాహనాలను ఫాస్టాగ్‌కు అనుసంధానం చేసుకోవడంలో యజమానులు వెనకబడటంతో గడువును పొడిగిస్తూ వచ్చింది. ఇప్పుడు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేయడంతో టోల్‌ప్లాజాల వద్ద పరిస్థితి ఎలా ఉంటుందన్నది చూడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News