Home తాజా వార్తలు ఐడిఎ బొల్లారంలో అగ్నిప్రమాదం

ఐడిఎ బొల్లారంలో అగ్నిప్రమాదం

Fire accident in plywood industry in IDA Bollaram

బొల్లారం: సంగారెడ్డి జిల్లా ఐడిఏ బోల్లారంలోని ఫ్లైవుడ్ పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్లైవుడ్ పరిశ్రమంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ కమ్మేయడంతో సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకోని మంటలను అదుపుచేస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.

Fire accident in plywood industry in IDA Bollaram