Home తాజా వార్తలు సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో అగ్నిప్రమాదం…

సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో అగ్నిప్రమాదం…

Fire Accident In Miryalaguda

సిద్దిపేట:  సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  ఐసోలేషన్ వార్డులో బుధవారం అర్ధరాత్రి ఒంటిగంటకు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. రోగులు, ఆస్పత్రి సిబ్బంది  భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఫర్నిచర్, ఐసోలేషన్ వార్డులో ఉన్న మిషనరీలు దగ్ధమయ్యాయి. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి మంటలను ఆర్పేశాయి. ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.