Monday, April 29, 2024

వైజాగ్ లో మొదటి బ్యాచ్ Speed 400 బైక్‌లను డెలివరీ చేసిన Triumph

- Advertisement -
- Advertisement -

వైజాగ్: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Triumph Speed 400 ను Triumph వైజాగ్ డీలర్‌షిప్‌ వద్ద ౦4 ఆగస్టు న వైజాగ్ లో డెలివరీ చేశారు. జూన్ 27న లండన్‌లో విడుదల చేసిన Triumph Speed 400 మరియు Scrambler 400 X వినియోగదారుల నుండి అపూర్వమైన స్పందనను పొందాయి. గత వారం పూణే, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో విజయవంతంగా విడుదల చేసిన తర్వాత, వైజాగ్‌లో మొదటి బ్యాచ్ వాహనాల డెలివరీ చేయటానికి నిర్వహించిన కార్యక్రమం లో Triumph Speed 400 కి అద్భుతమైన స్పందన లభించింది.

ఆన్‌లైన్‌లో Speed 400 ని బుక్ చేసుకున్న కస్టమర్‌లకు, ఉత్సాహం మరియు వేడుకలతో నిండిన వాతావరణంలో వారి బైక్‌లను మొదటిగా అందించారు. వారు ఈ బైక్ ల టెస్ట్ రైడింగ్ చేశారు. Triumph మోటార్‌సైకిల్స్‌ను నిర్వచించే అత్యుత్తమ నైపుణ్యం, అత్యాధునిక సాంకేతికతను హైలైట్ చేస్తూ కథలు, అనుభవాలు పంచుకోవడంతో డీలర్‌షిప్ లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది. తళతళ మెరుస్తున్న బైక్‌లు, సహజమైన వరుసలలో అమర్చబడి, ఆకర్షణీయమైన శైలి, శక్తి యొక్క భావాన్ని వెదజల్లాయి. డీలర్‌షిప్ సిబ్బంది కూడా మొదటి Triumph మోటర్ సైకిల్ ను డెలివరీ తీసుకున్న కస్టమర్‌ల లాగానే సంతోషం ప్రదర్శించటం తో పాటుగా అభిమానులకు తగిన సహాయం చేశారు. సౌకర్యవంతమైన, సంతృప్తికరమైన డెలివరీ అనుభవాన్ని నిర్ధారించడానికి ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చారు.

ఈ సందర్భంగా Probiking ప్రెసిడెంట్ సుమీత్ నారంగ్ మాట్లాడుతూ..“భారతీయ మోటార్‌సైకిల్ పరిశ్రమకు ఒక ప్రతిష్టాత్మక దినంగా ఈ కార్యక్రమం నిలువనుంది. ఈ రోజు, మా గౌరవనీయమైన కస్టమర్‌లకు మా అసాధారణమైన మోటార్‌సైకిళ్లను అందించినందుకు సంతోషిస్తున్నాము. వైజాగ్ లో అద్భుతమైన రైడింగ్ అనుభవాలను అందించడానికి మరియు బలమైన బైకింగ్ సంస్కృతిని కలిగి ఉన్న వైజాగ్ లో బలమైన కమ్యూనిటీని పెంపొందించడానికి ఇది మా మొదటి అడుగు. Speed 400 జోడింపుతో, మేము మా డీలర్ భాగస్వామితో కలిసి బ్రాండ్ Triumph ను ఔత్సాహిక రైడర్‌లకు సరసమైన ఎంపికగా మార్చే ప్రయాణాన్ని ప్రారంభించాము” అని అన్నారు.

కొత్త కస్టమర్లు 16,000 కి.మీల సర్వీస్ విరామాలతో రెండేళ్ల అపరిమిత మైలేజ్ వారంటీతో పాటు మరో మూడేళ్లపాటు పొడిగించిన వారంటీ సైతం పొందుతారు.

Bajaj Auto Ltd తన కొత్త చకన్ ప్లాంట్‌లో తయారు చేసిన Speed 400 వైజాగ్ లోని Triumph డీలర్‌షిప్‌లో ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.33 లక్షల కు అందుబాటులో ఉంటుంది. Speed 400 కోసం బుకింగ్‌లు కొనసాగుతున్నాయి మరియు ఆసక్తి గల కస్టమర్‌లు తమ బైక్‌లను ఆన్‌లైన్‌లో www.triumphmotorcyclesindia.com/booking వద్ద రిజర్వ్ చేయడం ద్వారా ప్రాధాన్యత జాబితాలో తమ స్థానాన్ని పొందవచ్చు లేదా మరింత సహాయం కోసం సమీపంలోని Triumph డీలర్‌షిప్‌ను సందర్శించండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News