Friday, April 26, 2024

విషాద నాగర్‌కర్నూల్

- Advertisement -
- Advertisement -
Five people killed in separate accidents in Nagarkurnool
విడివిడి ప్రమాదాల్లో ఒకేరోజు ఐదుగురి దుర్మరణం
మిద్దెపై నుంచి పడి ఒకరు, టిప్పర్ ఢీకొని మరొకరు, బస్సు కింద పడి ఇంకొకరు, కాలువలో పడి ఇద్దరు దుర్మరణం

మనతెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధిః నాగర్‌కర్నూల్ జిల్లాలో బుధవారం ఒకే రోజు వేరువేరు ప్రమాదాలలో ఐదుగురు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్ ఎదురుగా గల అయ్యప్ప ఫర్నీచర్స్ దుకాణం పై అంతస్తు నుంచి తమిళనాడు రాష్ట్రానికి చెందిన జక్కా అర్జున్ (35) కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని వద్ద లభించిన ఆధారాలతో తమిళనాడులోని శ్రీపెరంబదూర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అదే విధంగా అతని వద్ద హైదారబాద్‌లో నివాసముంటున్నట్లు లభించిన ఆర్సి ద్వారా పోలీసులు గుర్తించి ఇతని కుటుంబీకుల కోసం ఆరా తీస్తున్నారు. అదే విధంగా నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని వనపట్ల గేటు వద్ద ప్రధాన రహదారి పై టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో బల్మూర్ మండలం పొలిశెట్టిపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య (37) అనే ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఏఎస్సై చంద్రయ్య తెలిపారు.

అదే విధంగా పెంట్లవెల్లి మండలం జటప్రోలు అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం బస్సు కింద కొల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన గువ్వల ఆంజనేయులు ( 32) మృతి చెందాడు. బస్సు దిగుతుండగా ప్రమాదవశాత్తు టైరు కిందికి రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అదే విధంగా వంగూరు మండలం బాలానగర్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కెఎల్‌ఐ కాలువలో పడి అల్లె నాగరాజు (25) ,నరేష్ (23) మృతి చెందారు. వంగూరు మండల కేంద్రంలో తమ పనులను ముగించుకొని మంగళవారం సాయంత్రం తిరిగి రంగాపూర్ గ్రామానికి వెళ్తుండగా మలుపు వద్ద బైక్ అదుపుతప్పి కెఎల్‌ఐ కాలువలో పడి ఇద్దరు మృతి చెందారు. ఈ విషయాన్ని తెల్లవారుజామున స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒకే రోజు నాలుగు ఘటనలలో ఐదుగురు మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News