Wednesday, May 1, 2024

ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణ అనుకూలం: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

niranjan reddy
హైదరాబాద్: తెలంగాణలో 25 జిల్లాలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. శాసన సభలో ప్రశ్నోత్తరాలు సందర్భంగా నిరంజన్ మాట్లాడారు. తెలంగాణలో పెద్ద ఎత్తున పామ్ ఆయిల్ ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయంలో నియంత్రిత సాగుకు సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారని, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని పంటలు వేయాలని సూచించారు. దేశంలో నూనె గింజల ఉత్పత్తి దారుణంగా పడిపోయిందని, తెలంగాణలో పైలట్ ప్రాజెక్టు కింద ఆరు వేలకు పైగా ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నామన్నారు. పంటల మార్పిడి జరిగితేనే దిగుబడి పెరుగుతుందని, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని పంటలు వేయాలని, తెలంగాణలో కోటి 41 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నామని మంత్రి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News