Monday, May 6, 2024

కల్తీ ఆహార పదార్థాలపై బల్దియా ప్రత్యేక దృష్టి

- Advertisement -
- Advertisement -

ఫిర్యాదు చేస్తే చాలు అకస్మిక తనిఖీలు

Food inspectors raid on adulterated foods

మన తెలంగాణ /సిటీ బ్యూరో: వర్షకాలం నేపథ్యంలో కలుషిత ఆహార పదార్ధాలపై జిహెచ్‌ఎంసి హెల్త్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలోని ప్రధాన హోటళ్లు మొదల్కొని పలు ఆహార విక్రయ కేంద్రాల్లో ఆహార పదార్థాల కల్తీకి సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతుండడంతో తనిఖీలకు సిద్దమైంది. గతంలో కేవలం 5 మంది పుడ్ ఇన్‌స్పెక్టర్లకు తోడు సర్కిళ్ల వారిగా మెడికల్ ఆధికారులు మాత్రమే ఉండడంతో ఆహార పదార్ధాల కల్తీకి సంబంధించి పెద్దగా దృష్టి సారించలేకపోయ్యారు. అయితే బల్దియా ఇటీవలే 21 మంది పుడ్ సేప్టీ ఆఫీసర్లు శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి సర్కిళ్ల వారిగా విధులను అప్పగించారు. దీంతో నగరంలో ఆహార పదార్థాల కల్తీని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

సర్కిళ్ల వారిగా తనిఖీలు:

హైదరాబాద్ నగరం బిర్యానీలకు పెట్టింది పేరు కావడంతో దీనిని ఆసరాగా చేసుకున్ని ప్రముఖ హోటళ్లు సైతం కల్తీకి పాలుపడుతూ ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. వీటితో పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు మొదలు ఆహార పదార్థాల విక్రయ కేంద్రాల వరకు కల్తీ కొనసాగుతుండడంతోప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.దీంతో ఇప్పటీకే పుడ్ ఇన్స్‌పెక్టర్లలతో పాటు పుడ్ సేప్టీ ఆధికారులు నగర వ్యాప్తంగా విసృత్త తనిఖీలు నిర్వహింస్తు వారి పని పడుతున్నారు. అసలే కరోనా కాలం కావడంతో ప్రజలు నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతుండడంతో అకస్మిక తనిఖీలు నిర్వహించి ఆహార పదార్థాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు తరలిస్తున్నారు. తనిఖీల సమయంలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నా, కుళ్లిన పదార్ధాలతో ఆహార పదార్ధాలను తయారు చేసినట్లు గుర్తిస్తే అక్కడికక్కడే అధికారులు వీటిని సీజ్ చేయడంతో పాటు భారీగా జరిమానాలను విధిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News