Saturday, April 27, 2024

శ్రీలంక, పాకిస్థాన్ లాంటి పరిస్థితి భారత్‌కు లేదు

- Advertisement -
- Advertisement -

Foreign exchange reserves are adequate

విదేశీ మారక నిల్వలు తగినంతగా ఉన్నాయి
నిల్వలను పెంచడంలో ఆర్‌బిఐ బాగా పనిచేస్తోంది
ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్

న్యూఢిల్లీ : శ్రీలంక, పాకిస్థాన్ వంటి ఆర్థిక సమస్యలు భారత్‌కు ఎదురుకావని, విదేశీ మారకద్రవ్య నిల్వలను తగినంతగా ఉన్నాయని ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచడంలో ఆర్‌బిఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) బాగా పనిచేస్తోందని ఆయన అన్నారు. అందువల్ల శ్రీలంక, పాకిస్థాన్ దేశాల వంటి ఆర్థిక సంక్షోభం పరిస్థితులు భారత్ ఉండబోవని, ఇండియాకు విదేశీ రుణాలు కూడా తక్కువేనని అన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో ద్రవ్యోల్బణం ఉందని రాజన్ వివరించారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచుతోంది. అత్యధిక ద్రవ్యోల్బణం ఆహారం, ఇంధనంలో ఉంది. అయితే ప్రపంచంలో ఆహార ధరల పెరుగుదల తగ్గుముఖ పడుతోందని, వచ్చే రోజుల్లో భారతదేశంలో కూడా తగ్గుతాయని ఆయన అన్నారు.

శ్రీలంక-, పాకిస్థాన్ రెండు దేశాల్లోనూ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. జూలైలో శ్రీలంక రిటైల్ ద్రవ్యోల్బణం 61 శాతానికి చేరింది. ఇప్పుడు దేశం ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొంటోందని అన్నారు. పాకిస్తాన్ విషయానికొస్తే, రాజకీయ అశాంతి కారణంగా ఆర్థిక అనిశ్చితి పెరిగింది, రూపాయి విలువ తగ్గుతోంది. దీంతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కూడా అధ్వాన్నంగా మారిందని రాజన్ పేర్కొన్నారు. ఆర్‌బిఐ తాజా డేటా ప్రకారం, జూలై 22తో ముగిసిన వారానికి భారతదేశ విదేశీ మారక నిల్వలు 571.56 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అదే వారంలో విదేశీ మారక నిల్వల్లో 1.152 బిలియన్ డాలర్ల క్షీణత నమోదైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News