Sunday, April 28, 2024

హైదరాబాద్ నాలుగు వైపులా నాలుగు ఆస్పత్రుల నిర్మాణం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రూ.140 కోట్ల వ్యయంతో ఎంఎన్‌జె అదనపు బ్లాక్‌ను ఏర్పాటు చేశామని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎంఎన్‌జె ఆస్పత్రి అనుబంధ బ్లాక్‌ను వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. ఇన్ని దశాబ్ధాలుగా మనకు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులే దిక్కు అని అన్నారు. కొన్నేళ్లుగా నగరంలో కొత్త ఆస్పత్రుల నిర్మాణం జరగలేదని దుయ్యబట్టారు.

పెరిగిన అవసరాల మేరకు ఆస్పత్రులను సిఎం కెసిఆర్ విస్తరిస్తున్నారని ప్రశంసించారు. హైదరాబాద్ నాలుగు వైపులా నాలుగు ఆస్పత్రుల నిర్మాణం జరుగుతోందన్నారు. వచ్చే ఏడాది అందుబాటులోకి మరో 4 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉన్నాయని, గతంలో 20 ఏళ్లకోసారి కొత్త వైద్య కశాశాలల ఏర్పాటు జరిగేదని, ఈ ఎనిమిది ఏళ్లలో కొత్తగా 20 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకోగలిగామని హరీష్ రావు వివరించారు. 900 ఎంబిబిఎస్ సీట్లను 7 వేలకు పైగా పెంచుకోగలిగామని వివరించారు. జిల్లా ఆస్పత్రుల్లో డయాలిసిస్ సేవలు గతంలోనే ప్రారంభించామని, ఇకపై జిల్లా ఆస్పత్రుల్లో కూడా క్యాన్సర్ రోగులకు కూడా చికిత్స అందిస్తున్నామన్నారు. ఎనిమిది జిల్లా ఆస్పత్రుల్లో త్వరలోనే కీమో థెరపీ సేవలు ప్రారంభిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News