Monday, May 6, 2024

వేలిముద్రతో రూ.10 వేలు కాజేశారు….

- Advertisement -
- Advertisement -

రూ.10,000 కొట్టేసిన నిందితులు
ఆధార్ కార్డు, వేలిముద్రల ఫొటో డబ్బులు ట్రాన్స్‌ఫర్
సిఎ విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు

Fraud with Finger print Aadhaar card

మన తెలంగాణ/సిటీబ్యూరో: సైబర్ నేరాల్లో కొత్త రకం నేరం ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. పే పాయింట్ ఖాతాతో డబ్బులు కాజేసిన ఇద్దరు సిఎ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… విశాల్, అర్షద్ సిఎ చదువుతున్నా రు. ఇద్దరు విద్యార్థులు సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశా రు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రెవెన్యూ వెబ్‌సైట్ నుంచి మధురానగర్ కాలనీకి చెందిన సిద్ధిరెడ్డి వీరవెంకట సత్యనారాయణ మూర్తి భూముల దస్తావేజులు డౌన్‌లోడ్ చేసి అందులో ఉన్న ఆధార్ కార్డు, వేలిముద్రల ఫొటోలతో బ్యాంక్ ఖాతా నుంచి పే పాయింట్ అకౌంట్ ద్వారా రూ. 10,000 కాజేశారు. బ్యాంక్ ఖాతాలో డబ్బులు చూసుకున్న బాధితుడు తన బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.10,000 వేరు ఖాతాకు ట్రాన్స్‌ఫర్ కావడంతో వెంటనే ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధార్ కార్డు, వేలిముద్ర, నీటి చుక్కల సాయంతో పే పాయింట్ వాలెట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకుని, డబ్బులు దోచుకున్నట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News