Monday, April 29, 2024

విభజన చట్టం హామీలను నెరవేర్చండి

- Advertisement -
- Advertisement -

Fulfill guarantees of Separation Act:Mahmood ali

రాష్ట్రానికి రావాల్సిన నిధులివ్వండి

తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సులో కేంద్రానికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ విజ్ఞప్తి

మనతెలంగాణ/హైదరాబాద్ : కొత్తగా ఏర్పాటు అయిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలుగా సంపూర్ణ సహకారాలు అందించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కోరారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోయినప్పటికీ తమ ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందన్నారు. ఇలాంటి రాష్ట్రాలకు కేంద్ర నుంచి తగు సహకారం లభిస్తే తెలంగాణ మరింత అద్భుతాలు సృష్టిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా యుద్దప్రాతిపదికన కేంద్రం హామీలను నెరవేర్చాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు.ఆదివారం తిరుపతిలో హోమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తిరుపతి సదస్సుకు హాజరైన రాష్ట్ర హోమంత్రి మహ్మద్ అలీ విభజన చట్టంలోని హామీలతో పాటు మరికొన్ని ఇతర సమస్యలను తెలంగాణ రాష్ట్రాల మధ్యభూముల ముంపు సమస్య నెలకొందన్నారు.

ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి సంయుక్త సర్వేను చేపట్టాలని మహమూద్ అలీ కోరారు. అలాగే రూ.6015 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆంధ్ర ప్రదేశ్ తమ రాష్ట్రాన్ని అడుగుతోందని, కానీ ఆ రాష్ట్రమే తమ విద్యుత్ డిస్కంలకు రూ. 3,442 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందన్నారు. ఈ వివాదాన్ని కూడా కేంద్రం యుద్దప్రాతిపదికన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఢిల్లీలోని ఎపి భవన్‌కు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆస్తుల విభజన సమస్యపై కూడా కేంద్రం పూర్తి స్థాయిలో దృష్టి సారించాలన్నారు. వీటితో పాటు హైకోర్టు, ఉన్నత విద్యామండలి సమస్యను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రాంతీయ విశ్వవిద్యాలయం, ములుగు జిల్లాలో రూ.840 కోట్లతో యువతకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికి కేంద్రం వద్దే ఉన్నాయన్నారు. విభజన చట్టంలో కేంద్రం గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చిందని…దానిపై కూడా దృష్టి సారించాలన్నారు.

వీటితో పాటు మరికొన్న విభజన చట్టంలోని హామీలు ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి యుద్దప్రాతిపకన కృషి చేయాలన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిధుల ఆవశ్యకతకు సంబంధించిన వాటిపై కూడా నివేదక రూపంలో కేంద్రానికి ఇచ్చామన్నారు. ఈ నేపథ్యంలో సత్వరమే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.

కొత్త రాష్ట్రానికి సంపూర్ణ సహకారాలు అందించాలి

కొత్తగా ఏర్పాటు అయిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలుగా సంపూర్ణ సహకారాలు అందించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కోరారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోయినప్పటికీ తమ ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందన్నారు. ఇలాంటి రాష్ట్రాలకు కేంద్రం నుంచి తగు సహకారం లభిస్తే తెలంగాణ మరింత అద్భుతాలు సృష్టిస్తుందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా యుద్దప్రాతిపదికన కేంద్రం హామీలను నెరవేర్చాలన్నారు. రాష్ట్ర సమస్యలు , విభజన చట్టంలోని హామీలపై ప్రభుత్వం రూపొందించిన నివేదికను అమిత్‌షాకు అందజేశారు. అంశాల వారీగా వాటిని సదస్సులో వివరించారు. తెలంగాణ దేశంలో అత్యంత యువరాష్ట్రం అని తెలిపారు. ఎపి పునర్ విభజన చట్టం మేరకు రాష్ట్రం ఏర్పడిన కొద్ది నెలల్లోనే హైదరాబాద్ కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం ఆతిధ్యం ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయమే ప్రధానం అని తెలిపారు.

రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ రంగం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకొని వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు బీజం వేశారన్నారు. కృష్ణా, గోదావరి నదీజలాలను సమర్ధవంతంగా ఉపయోగించుకుంటూ వ్యవసాయ రంగంలో పలు కొత్త పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా రాష్ట్రంలోని 60లక్షల మందికి ఏటా రూ.15వేల కోట్లు అందజేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఎకరానికి ఏటా రూ.10వేలు రైతుబంధు ద్వారా సాయం అందిస్తున్నట్టు వివరించారు.వ్యవసాయ రంగానికి 24గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. శాంతి భద్రతల పరంగా పోలీసు శాఖ ద్వారా సమర్ధవంతమైన సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. షీటీమ్స్ ,భరోసా కేంద్రాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయన్నారు. ఆరోగ్యకరమైన మానవ వనరులే దేశానికి ప్రధాన సంపద అని భావించి మహిళా సంక్షేమరంగంలో కెసిఆర్ కిట్ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.

తల్లి,బిడ్డలకు అన్ని విధాల అండగా నిలుస్తున్నట్టు తెలిపారు. కరోనా సమయంలో ఎన్నో సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నట్టు తెలిపారు. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పలు కీలక అంశాలు ఇంకా చిక్కుముడులుగానే ఉన్నాయన్నారు. వీటిని వెంటనే పరిష్కరించాలని కోరారు. పది లక్షల మంది ఉద్యోగుల విభజన కూడా విజయవంతంగా జరిగిందన్నారు. కోర్టుల పరమైన కొన్ని సమస్యలు ఇంకా మిగిలాయని తెలిపారు. రెండు రాష్ట్రాలు వీటిని సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన విభజన చట్టంలోని హామీలను నెరవేర్చి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అందజేస్తే తెలంగాణ రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధిని సాధించే అవకాశాలు ఉన్నాయని రాష్ట్రహోమంత్రి మహ్మద్ అలి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నుంచి అందజేసిన నివేదికలోని అంశాలపట్ల కేంద్ర మంత్రి అమిత్‌షా సానుకూలంగా స్పందించారు. అన్ని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్రానికి హామీ ఇచ్చినట్టు మహ్మద్‌అలీ పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News