Monday, April 29, 2024

జోరుగా ధాన్యం కొనుగోళ్లు

- Advertisement -
- Advertisement -

Vanakalam grain purchases are active

గత వానాకాలం మాదిరిగానే ఈసారి కూడా సేకరణ
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 4,039 కేంద్రాలు ప్రారంభం

గతేడాది నవంబర్ 13నాటికి
8లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ
ఈ ఏడాది అదే తేదీకి
పూర్తయిన 7లక్షల71వేల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ దీని విలువ రూ.1510కోట్లు లక్షా 13వేల మందికి పైగా రైతుల నుంచి కొనుగోలు ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు పంపిస్తున్నాం : మంత్రి గంగుల

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా సాగుతున్నాయన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 4039 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయన్నారు. గత వానాకాలంలో ఎలాగైతే ధాన్యాన్ని సేకరించామో దాదాపు అదే సగటుతో ఇప్పుడు కూడా ధాన్యాన్ని సేకరిస్తున్నామన్నారు. గత సంవత్సరం సీజన్‌లో నవంబర్ 13వ తేదీ వరకు దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తే ప్రస్తుతం (శనివారం వరకు) 1లక్షా 13వేలకు పైగా రైతుల నుండి 1,510 కోట్ల విలువ గల 7లక్షల 71వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించామన్నారు. ధాన్యం రవాణాలోనూ ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి గంగుల పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో తగినన్ని టార్పాలిన్లు సైతం ఏర్పాటు చేసామన్నారు. అవసరమైన చోట సొంతంగా సమకూర్చుకోవాల్సిందిగా అధికార యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు.

శరవేరంగా రేషన్ బియ్యం పంపిణీ

రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందజేస్తున్న రేషన్ బియ్యం పంపిణీ వేగంగా జరుగుతున్నదని మంత్రి గంగుల తెలిపారు. నవంబర్ నెల కోసం 2,99,310 మెట్రిక్ టన్నుల కేటాయింపులకుగానూ ఇప్పటి వరకూ 77 శాతం మంది 2,29,231 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశామన్నారు. దాదాపు 67లక్షల కార్డుదారులు బియ్యాన్ని తీసుకున్నారన్నారు. పౌరసరఫరాల శాఖ సర్వర్లలో, ఈపాస్ మిషనరీల్లో ఎలాంటి సమస్యలు లేవన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News