Tuesday, April 30, 2024

రాష్ట్రాలకు జిఎస్‌టి నష్టపరిహారం కింద త్వరలో రూ.35 వేల కోట్లు

- Advertisement -
- Advertisement -

GST

 

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లలో ఆదాయ నష్టాలు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్రం త్వరలోనే రూ.35 వేల కోట్లు విడుదల చేయనుంది. జిఎస్‌టి చట్ట ప్రకారం 2015 16 ఆర్థిక సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్రాల పన్ను ఆదాయం 14 శాతం పెరగకుంటే ఆ నష్టాన్ని కేంద్రం భరిస్తూ అయిదు సంవత్సరాల పాటు రాష్ట్రాలకు ఆ నష్టాన్ని చెల్లిస్తుంది. 2017 18, 2018 19, ఆర్థిక సంవత్సరాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో నష్ట పరిహారం చెల్లింపునకు సంబంధించి కేంద్రం, రాష్ట్రాల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. కానీ ఈ పరిహారం మొత్తం తగినంతగా ఉండడం లేదంటూ రాష్ట్రాలు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ మాసాలకు సంబంధించి గత ఏడాది డిసెంబర్‌లో ప్రభుత్వం రూ.35,300 కోట్లు విడుదల చేసింది.

మరో 35 వేల కోట్ల నిధులను రెండు విడతల్లో సంచిత నిధి (కన్సాలిడేటెడ్ ఫండ్)నుంచి కేంద్రం విడుదల చేయనుంది. త్వరలోనే ఈ మొత్తాన్ని విడుదల చేయడం జరుగుతుందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. తొలి విడత అక్టోబర్, నవంబర్ నెలలకు సంబంధించి ఉండనుంది.జిఎస్‌టిలో అధికంగా వసూలయ్యే మొత్తాన్ని కేంద్రం గతంలో సంచిత నిధిలోకి మళ్లించగా… ప్రస్తుతం నష్టపరిహారం నిధిలో జమ చేస్తోంది. 2017 జులైలో జిఎస్‌టి అమలు ప్రారంభమైనప్పటినుంచి కేంద్రం ఆదాయ నష్టపరిహారం కింద రాష్ట్రాలకు రూ.2.11 లక్షల కోట్లు చెల్లించింది. 2017 జులైనుంచి 2018 మార్చిమధ్య కేంద్రం రూ.48,785 కోట్లు విడుదల చేయగా, 2018 ఏప్రిల్, 2019 మార్చి మధ్య రూ.81,141 కోట్లు రాష్ట్రాలకు చెల్లించింది. గత ఏడాది ఏప్రిల్ మే నెలలకు రూ.17,789 కోట్లు, జూన్‌జులై నెలలకు రూ.27,956 కోట్లు విడుదల చేయగా, ఆగస్టుసెప్టెంబర్ నెలలకు గాను మరో రూ.35,298 కోట్లను రాష్ట్రాలకు నష్టపరిహారం కింద కేంద్రం విడుదల చేసింది.

Funds to States under GST Indemnity
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News