Friday, May 3, 2024

మళ్లీ కరోనా నోడల్ కేంద్రంగా ‘గాంధీ’

- Advertisement -
- Advertisement -

Gandhi Hospital into only Covid hospital

మన తెలంగాణ/హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి మళ్లీ కరోనా నోడల్ కేంద్రంగా మారింది. ఈ రోజు నుంచి అన్ని ఓపి సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసరం కానీ శస్త్రచికిత్సలను తక్షణం నిలిపివేసి, ఇప్పటికే తేదీలు ప్రకటించిన కేసులకు కొత్త తేదీలను నిర్ణయించాలని ప్రభుత్వం వైద్యశాఖకు సూచించింది. కేసులు తీవ్రత తగ్గే వరకు గాంధీ హాస్పిటల్‌లో కరోనా కేసులు తప్ప ఇతర ట్రీట్మెంట్ కేసులను చేర్చుకోవద్దని ప్రభుత్వం ఆదేశించింది.రోజురోజుకి కొత్త కేసుల సంఖ్య పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం ఒక్కరోజే గాంధీలో ఏకంగా 150 మంది అడ్మిట్ అయినట్లు అధికారిక లెక్కలు చెబుతుండగా, అనధికారికంగాగత వారం రోజుల నుంచి ప్రతి పది నిమిషాలకు ఓ కొత్త కేసు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం గాంధీలో ఇప్పటికే నాన్ కొవిడ్ కింద అడ్మిటై చికిత్స పొందుతున్న వారిని పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాతనే డిశ్చార్జ్ చేస్తామని గాంధీ సూపరింటెండెంట్ ప్రో డా రాజరావు అన్నారు. లేకుంటే సదరు రోగులు ఎంతో ఇబ్బంది పడతారని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సీరియస్ కేసులన్నీ ఇక్కడే….
కరోనా క్రిటికల్ రోగులందరిని గాంధీలోనే చికిత్స అందించాలని వైద్యశాఖ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లోని సీరియస్ కేసులను ఇక్కడికే తరలించనున్నారు. అయితే పేషెంట్లకు ఇబ్బందులు కలుగకుండా పాజిటివ్ వ్యక్తుల అడ్మిషన్, ట్రిట్మెంట్, టెస్టులు, డిశ్చార్జ్‌ల విషయంలో ప్రతి ఒక్కరి సమాచారం సమగ్రంగా ఉండేందుకు ప్రత్యేక టీంలను కూడా సిద్ధం చేస్తున్నారు. పేషెంట్ ఎప్పుడు అడ్మిట్ అయ్యారు? 14 రోజులు ఎప్పుడు పూర్తయింది? మొదటి రోజు ఏ పరీక్ష చేయాలి? రెండవ పరీక్ష ఎప్పుడు చేయాలి? ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది? అనే పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు సిద్దంగా ఉంచనున్నారు. అంతేగాక ప్రతి కరోనా రోగికి డయాబెటిస్, బిపి ఇతర ఆరోగ్య సమస్యలు పరీక్షలను ఎప్పటికప్పుడు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డు కు వెళ్ళే దారిలో ఏ ఒక్కరిని కూడా అనుమతించవద్దని, పూర్తిగా వైరస్ సోకిన వారు రావడానికి మాత్రమే దీనిని ఉపయోగించాలని సూపరింటెండెంట్ డా రాజరావు కూడా ఆదేశాలు జారీ చేశారు. లిఫ్ట్ కూడా వైరస్ సోకిన వారిని తీసుకొని వెళ్ళడానికి మాత్రమే ఉపయోగించాలన్నారు. హాస్పిటల్ లో మిగతా పేషెంట్లు ఎవరు కూడా ఈ కరోనా వైరస్ సోకిన వారిని ఉంచే వార్డులకు వెళ్ళడానికి వీలులేకుండా దారులు మూసివేయాలని సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు.ప్రతి రెండు గంటలకు ఒకసారి శానిటేషన్ సిబ్బంది లిఫ్ట్ లను, వార్డ్ లను ఆల్కహాల్ బేస్డ్ క్లీనర్ల తో శుభ్రం చేయాలన్నారు. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Gandhi Hospital into only Covid hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News