Saturday, May 4, 2024

సమ్మె విరమించిన గాంధీ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః గాంధీ ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్ నర్సులు సమ్మె విరమించారు. జీతాల పెంపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ వంటి పలు డిమాండ్లతో గత రెండు రోజులుగా గాంధీ ఆస్పత్రిలో ఆందోళనకు దిగిన ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో బుధవారం ప్రభుత్వం జరిపిన చెర్చలు సఫలం అయ్యాయి. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ప్రకటించింది. నర్సులకు రూ.17,500 నుంచి రూ.25వేలకు వేతనాన్ని పెంచేందుకు అధికారులు అంగీకరించారు. కరోనా విధుల్లో ఉన్నవాళ్లకు ఇన్స్‌ంటీవ్ కింద రూ.750 ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నాలుగో తరగతి ఉద్యోగులకు రోజుకు రూ.300 ఇన్స్‌ంటీవ్, షిఫ్ట్‌ల ప్రకారం నెలలో 15 రోజులు విధులు నిర్వహించేలా వెసులుబాటు కల్పించేందుకు అంగీకరించారు. ఔట్‌సోర్సింగ్ నుంచి కాంట్రాక్టులోకి మార్చేందుకు ప్రయత్నిస్తామన్న ప్రభుత్వ హామీతో నర్సులు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.

Gandhi Outsourcing Staff Call off strike

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News