Saturday, April 27, 2024

నేడే నిమజ్జనం

- Advertisement -
- Advertisement -

Ganesh immersion today

శనివారం నాడు ప్రగతి భవన్‌లో గణపతి హోమం నిర్వహిస్తున్న సిఎం కె.చంద్రశేఖర్‌రావు శోభమ్మ దంపతులు. మంత్రి కెటిఆర్ శైలిమ దంపతులు, సిఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య తదితరులున్నారు.

సర్వం సిద్ధం చేసిన అధికారులు

హైదరాబాద్ నగరమంతటి నుంచి 38,500పైచిలుకు వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్‌కు వచ్చే అవకాశం
27వేల మంది పోలీసులతో భారీ భద్రత, బందోబస్తు

మన తెలంగాణ / హైదరాబాద్: గణేష్ నిమజ్జనానికి అధికారులు అంతా సిద్ధం చేశారు. ఈ ఏడాది నగరమంతటి నుంచి 38500 పై చిలుకు వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ నిమజ్జనంలో పాల్గొననున్న లక్షలాది మందికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లను చేశారు. వినాయక శోభయాత్ర కొనసాగనున్న అన్ని ప్రధాన మార్గాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు నిమజ్జనానికి తరలివచ్చే వినాయకులకు స్వాగతం పలికేందుకు భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితితో పాటు ఇతర సంస్థలకు స్వాగత వేదికలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా నిమజ్జనానికి తరలి వచ్చే భక్తుల కోసం అన్నదానం, మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన మార్గాల్లో పారిశుద్ధ నిర్వాహణకు సంబంధించి జిహెచ్‌ఎంసి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. అదేవిధంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రధాన నిమజ్జన కేంద్రమైన హుస్సేన్‌సాగర్ వద్ద అధికారులు పూర్తి ఏర్పాట్లను చేశారు. ఇక్కడ అన్ని శాఖల అధికారులతో కలిపి కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఈ ఈ కేంద్రం ద్వారా ఆయా శాఖల అధికారులు తమ సిబ్బందికి ఎప్పటికప్పుడు మార్గ నిర్ధేశనం చేయనున్నారు. ఈ ఏడాది తొలిసారిగా పివి ఘాట్ మార్గంలోను నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.

హుస్సేన్ సాగర్ చుట్టూ మొత్తం 44 క్రేన్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాత్రి వేళ నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు కలుకుండా చుట్టూ 2600 పై చిలుకు ఎల్‌ఈడి లైట్లను ఏర్పాటు చేయడంతో ఈ ఈ ప్రాంతమంతా వెన్నల కురుస్తోంది. అదేవిధంగా హుస్సెన్ సాగర్‌లో ప్రమాదవశాత్తు ఎవరైనా పడితే వారిని రక్షించేందుకు ప్రత్యేకంగా బోట్లతో పాటు గజ ఈతగాళ్లను మోహరించారు. అదేవిధంగా గ్రేటర్ వ్యాప్తంగా హుస్సెన్ సాగర్‌తో పాటు శివారు ప్రాంతాల్లో 14 చెరువులు, మరో 25 నిమజ్జనం కొలనుల్లో నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది మొత్తం 300 పైగా క్రేన్లను ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాల్లో నిమజ్జనం ప్రక్రియ వేగంగా కొనసాగేందుకు ఈ ఏడాది ప్రత్యేక చర్యలను తీసుకున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి రెండు రోజుల ముందునుంచే నిర్వహకులు ఏర్పాట్లు చేశారు. అన్ని అనుకూలిస్తే ఆదివారం మధ్యాహ్నాం 3 గంటలలోపు నిమజ్జనం పూర్తి చేసేందుకు ప్రణాళికలను సిద్దం చేశారు. తరలించేందుకు 26 టైర్ల ట్రాలీతో కూడిన భారీ ట్రాన్స్‌పోర్ట్ వాహనం శనివారం మధ్యాహ్ననికే చేరుకుంది.

ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షణ

గణేష్ శోభయాత్ర, నిమజ్జన కార్యక్రమాన్ని ఏరియల్ వ్యూ ద్వారా మంత్రులు పరిశీలించనున్నారు. హుస్సెన్ సాగర్‌తో పాటు నగరంలోని వివిధ చెరువుల్లో జరగనున్న నిమజ్జన కార్యక్రమాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీతో పాటు డిజిపి మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్‌లు మధ్యా హ్నం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1 గం ట ప్రాంతంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్ బయలు దేరి నగరంలో జరగుతున్న శోభయాత్రతో పాటు నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించనున్నారు. ఖైరతాబాద్‌లో కొలుదీరిన పంచముఖ రుద్రమహా గణపతి దర్శనానికి భక్తులు పొటెత్తారు. దర్శనానికి శనివారమే చివరి రోజు కావడంతో వేలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఈ ప్రాంతామంతా భక్తులతో కిక్కిరిసి పోయింది. శనివారం రాత్రి 9 గంటల వరకు దర్శనం కోసం అనుమతించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News