Sunday, May 12, 2024

నూతన రేషన్ కార్డులు అందించడం సంతోషంగా ఉంది

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి: ముఖ్యమంత్రి ఆదేశాలతో గొప్ప పవిత్ర కార్యక్రమమైన నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియను భూపాలపల్లి జిల్లా నుండి ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం మంత్రి సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి గంగుల లబ్దీదారులకు రేషన్ కార్డులను అందించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కరోనా సంక్షోభంతో ఎంతో మంది రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారని, అప్లై చేసుకున్న అందరి దరఖాస్తులని పరిశీలించి దేశ చరిత్రలోనే మొదటి సారిగా ఒకేసారి నూతనంగా 3,09,083 కార్డులు.. 8,65,430 లబ్దీదారులకు ఆహార భద్రతా కార్డులందించామన్నారు. భూపాలపల్లి జిల్లాలో 3002 కార్డుల్ని అందిస్తున్నామన్నారు. ఏటా 2766 కోట్లతో 90లక్షల 50 వేలకార్డులకు, 2కోట్ల 88లక్షల మందికి ఆహారధాన్యాలు సరఫరా చేస్తూ వారి ఆకలిని ప్రభుత్వం తీరిస్తుందన్నారు. కరోనాతో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులున్నా కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పంతోనే ఇది సాద్యమయిందన్నారు. గతంలో 2009లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క రేషన్ కార్డు కోసం ఎమ్మెల్యేలు అడుక్కున్నా ఇవ్వలేదన్నారు, పైరవీకారులకు మాత్రం రేషన్ కార్డులందేవన్నారు. కానీ నేడు ఎలాంటి ఫైరవీలు లేకుండా పూర్తి పారదర్శకంగా కార్డులు జారీ చేశామన్నారు. ప్రతీ ఒక్కరూ తెలంగాణ రాకముందు పరిస్థితులకు నేటి పరిస్థితులకు తేడాల్ని గమనించాలన్నారు మంత్రి గంగుల.

75 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో ఎంతో మంది ప్రధానులు, ముఖ్యమంత్రులు మారారని కానీ ఏ ఒక్కరూ కేసీఆర్ గారి ప్రభుత్వంలా పనిచేయలేదన్నారు. నాడు పదెకరాల భూమున్నా పంట పండించలేకపోయామన్నారు, ఆకాశం వైపు నీటికోసం ఎదురు చూసి అరిగోస పడ్డామన్నారు, పంట పండించడానికి తెచ్చిన అప్పు మిత్తి పెరిగి భూమిని అమ్ముకునే పరిస్థితి ఉండేదన్నారు, మోటార్లు కాలిపోతే పడ్డ అవస్థలు వర్ణనాతీతం అన్నారు. ఎమ్మెల్యేలుగా ఎన్నోసార్లు అసెంబ్లీకి ఎండిపోయిన నార్లు, కాలిపోయిన మోటార్లతో వెళ్లి నిరసన తెలిపే వాళ్లమని, ఇవాల రెప్పపాటైన కరెంటు పోతుందా… నాటి గడ్డు పరిస్థితులు కన్పిస్తున్నాయా అని ప్రజల్ని ప్రశ్నించారు. తెలంగాణ రాకముందు 10 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఎఫ్.సి.ఐ కు అందించిన తెలంగాణ ప్రాంతం నేడు ఒక్క గుంట భూమి పెరగకున్నా కేవలం కేసీఆర్ గారు ఇచ్చిన నీళ్లు, నాణ్యమైన ఉచిత కరెంటు, రైతుబందుతో, రైతు భీమా, ధాన్యం సేకరణ లాంటి పథకాల వల్ల సాగు భరోసాతో 92 లక్షల 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఒక్క పంటకే ఎఫ్.సి.ఐకు అందించామన్నారు. ఒకప్పుడు పంజాబ్ నుంచి బియ్యం దిగుమతి చేసుకున్న మనం ఇవ్వాల భారతదేశం మెత్తానికి బియ్యాన్ని అందిస్తున్నామనే మాటని సాక్షాత్తు ఎప్.సి.ఐ ఛైర్మనే అంటున్నారన్నారు. గతంలో డిల్లీకి వెల్తే మనల్ని మద్రాసీలు అనేవారని ఇవ్వాల మనల్ని హైదరాబాదీలు, తెలంగాణ వ్యక్తులు అని పిలుస్తున్నారని, ఈ స్థాయికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణను అభివ్రు ద్ది చేశారని గర్వంగా చెప్పారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏ ఒక్క బీజేపీ పాలిత, కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనైనా తెలంగాణలో ఉన్న పథకాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు.

24గంటల నిరంతరాయ ఉచిత కరెంటు, కాళేశ్వర జలాలతో అద్భుతమైన పంటల్ని పండించి దేశానికే అన్నపూర్ణగా తెలంగాణను కేసీఆర్ నిలిపారన్నారు. కాలడ్డం పెట్టి తెచ్చిన కాళేశ్వర జలాలతో తెలంగాణలో నిండు వేసవిలో చెరువులు మత్తడులు దుంకుతున్నాయన్నారు. ఇవే కాదు అనేక సంక్షేమ పథకాల్ని తెలంగాణ ప్రవేశపెట్టిందన్నారు. ఆడబిడ్డకు పెండ్లి చేయడానికి ఒకప్పడు తెలంగాణ తల్లి పడే కష్టం అంతా ఇంతా కాదన్నారు. మంచి సంబందం చూసుకొని కట్న, కానుకలు మాట్లాడుకొని పుట్టింటికి వెళ్లి తండ్రిని, అన్నను అడిగితే ఇచ్చే పరిస్థితి గతంలో లేదన్నారు. ఈ ఇబ్బందుల్ని అదిగమించడానికి మనసున్న మన సీఎం కేసీఆర్ మేనమామలా మారి కళ్యాణ లక్ష్మీతో లక్ష రూపాయలు అందిస్తున్నారన్నారు. తొలుతూరు కాన్పుకు ఇంటికొచ్చిన బిడ్డకు కాన్పు చేయడం కోసం 13వేలిచ్చి కేసీఆర్ కిట్ అందించిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. వెనుకబడిన, ధళిత బిడ్డలు ఆత్మగౌరవంతో ఎదగాలని కేవలం 16 ఉన్న బిసి గురుకులాల్ని 261 కి పెంచి రూపాయి ఖర్చు లేకుండా కార్పోరేట్ విద్యను అందస్తున్నామన్నారు. మరో 20 కాలేజీలకు తోడు ఈ సంవత్సరమే అదనంగా 119 స్కూళ్లను జూనియర్ కాలేజీలు అప్ గ్రేడ్ చేస్తున్నామన్నారు. తెలంగాణకు స్వపరిపాలనే శ్రీరామరక్ష, కేసీఆర్ పాలనే అన్ని విదాల రక్ష ఇలా అన్నిరంగాల్లో తెలంగాణను ముందుకు తీసుకుపోతున్న కేసీఆర్ గారికి ప్రజల తరుపున ధన్యవాదాలు తెలియజేశారు. అండగా ఉండి మరింత అభివ్రుద్దిని సాదించుకోవాలని పిలుపునిచ్చారు. అహర్నిషలు పేదలకు అన్నం అందించేందుకు క్రుషి చేస్తున్న పౌరసరఫరాల శాఖ అధికారులను ఈ సందర్భంగా మంత్రి గంగుల అభినందించారు.

Gangula Kamalakar begins distribution of new ration card

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News