Monday, April 29, 2024

బిసిలందరూ టిఆర్ఎస్ వైపై: మంత్రి గంగుల

- Advertisement -
- Advertisement -

Gangula Kamalakar Press Meet in Telangana Bhavan

హైదరాబాద్: బిసి విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్ దేనని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడారు. బిసి విద్యార్థుల భ‌విష్య‌త్‌ను దృష్టి పెట్టుకుని ఈ ఆరేళ్ల‌లో 240 గురుకుల పాఠ‌శాల‌లు, 19 గురుకుల క‌ళాశాల‌ల‌ను ఏర్పాటు చేశామన్నారు. బిసి విద్యాలయాల్లో 90 వేల మంది చదుతున్నారని ఆయన పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా బిసిల ఆడపిల్లలకు అండగా నిలుస్తున్నమన్నారు. బిసిలకు కోకాపేటలో ఎంతో విలువైన 80 ఎకరాల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు.

మార్కెట్ కమిటిల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కెసిఆర్ దేననని ఆయన స్పష్టం చేశారు. గత సమైక్య పాలనలో ఎంబిసిలను పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. కుల వృత్తులకు పునర్ వైభవం తీసుకొచ్చామని ఆయన తేల్చి చెప్పారు. 36 కులాలను ఎంబిసిల్లో కలిపిన ఘనత తమ  ప్రభుత్వానిదేనన్నారు. సిరిసిల్ల చేనేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపామని ఆయన చెప్పారు. బిసిల అభ్యున్నతికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో బిసిలందరూ టిఆర్ఎస్ వైపై ఉన్నారని తేల్చిచెప్పారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా కల్యాణలక్ష్మి లాంటి పథకం ఉందా… అని ఆయన ప్రశ్నించారు. బిజెపి నేత లక్ష్మణ్ ప్రధాని మోడీతో కొట్లాడి కేంద్రంలో బిసి శాఖ ఏర్పాటు చేసేలా చూడాలని మంత్రి గంగుల డిమాండ్ చేశారు.

Gangula Kamalakar Press Meet in Telangana Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News