Monday, November 4, 2024

ప్రియుడిని చంపిన కేసులో ప్రియురాలు అరెస్టు….

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రియుడిని చంపిన కేసులో ప్రియురాలును అరెస్టు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు సంవత్సరాల నుంచి పావని(21), తాతాజీనాయుడు(25) ప్రేమించుకుంటున్నారు. ఎవరికి తెలియకుండా దేవాలయంలో ఒక రోజు ఆమెకు తాతాజీ తాళీ కట్టాడు. అందరి ముందు పెళ్లి చేసుకోవాలని పావని కోరడంతో తాతాజీ తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో తాతాజీ దూరంగా ఉంటున్నాడు. తనని మోసం చేసిన తాతాజీని అంతం చేయాలని పావని ప్లాన్ వేసుకుంది. పంగిడి వచ్చిన ఆమె తాతాజీని కలిసింది. బైక్‌పై ఇద్దరు సరదాగా కొంచెంసేపు తిరిగారు. మలకపల్లిలో దించేందుకు వెళ్తుండగా వెనుక నుంచి కత్తితో అతడి వీపుపై ఆమె పొడిచింది. దీంతో తాతాజీ బైక్‌పై  నుంచి కుప్పకూలిపడిపోవడంతో అదే కత్తితో పలుమార్లు మెడపై పొడిచింది. అనంతరం తన తెచ్చుకున్న రెండు కత్తితో పొడుచుకుందామనేసరికి వాహనదారులు వద్దని వారించడంతో ఆగిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News