Friday, April 26, 2024

కొంపముంచిన టిక్‌టాక్ ప్రేమాయణం

- Advertisement -
- Advertisement -
tik-tok-love
జూబ్లీహిల్స్ పీఎస్‌లో యువతి ఆత్మహత్యాయత్నం…!

హైదరాబాద్ : టిక్‌టాక్ ప్రేమాయణం కొంపముంచింది. యువకుడు మోసం చేశాడని జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన ఆ యువతిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తెలిసిన సమాచారం మేరకు టిక్‌టాక్‌లో యువతికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ మధ్య టిక్‌టాక్‌లో ప్రేమాయణాలు జోరందుకుంటున్న సంగతి తెలిసిందే. యువతి కూడా టిక్‌టాక్ ద్వారా సదరు యువకుడి ప్రేమలో పడిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ.. ప్రియుడు తనను మోసం చేశాడని ఆరోపిస్తూ జూబ్లీహిల్స్ పీఎస్‌లో బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రియుడు గురించి ఓ సెల్ఫీ వీడియో కూడా స్వప్న తీసింది. కాగా, స్వప్న పీఎస్‌లో ఎందుకు ఆత్మహత్యకు యత్నించింది? ప్రియుడు ఎక్కడున్నాడనే విషయాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు ఇంతవరకూ పెదవి విప్పలేదు.

Girl attempt to suicide at jubilee hills police station

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News