Tuesday, May 7, 2024

అబ్బాయితో పెళ్లి కోసం హోర్డింగ్ ఎక్కిన బాలిక (వీడియో)

- Advertisement -
- Advertisement -

భోపాల్: తాను ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేయాలని మైనర్ బాలిక హోర్డింగ్ పైకి ఎక్కిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని పర్‌దేశీపూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భండారి బ్రిడ్జి ప్రాంతంలో తాను ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేయాలని ఓ మైనర్ బాలిక హోర్డింగ్ పైకి ఎక్కడంతో జనాలు గుమిగూడారు. అబ్బాయితో ప్రేమలో ఉన్నానని పెళ్లి చేసుకుంటానంటే తన తల్లి ఒప్పుకోవడంలేదని పేర్కొంది. పోలీసులు అక్కడికి చేరుకొని బాలికను కిందకు దిగాలని సూచించారు. అబ్బాయి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటానంటేనే కిందకు దిగుతానని బాలిక తెలిపింది. పోలీసులు ఆ అమ్మాయిని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు.

courtesy by ది టైమ్స్ ఆఫ్ ఇండియా

https://www.youtube.com/watch?v=NXqx1j3ZQ6Q

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News