Thursday, May 16, 2024

ప్రియుడికి కాబోయే భార్యపై యువతి దాడి….

- Advertisement -
- Advertisement -

Girl friend attack on friend wife

బెంగళూరు: ప్రియుడికి కాబోయే భార్యపై ఓ యువతి కత్తితో దాడి చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం శిడ్లఘట ప్రాంతంలో జరిగింది. సదరు యువతిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అనేమడుగు గ్రామంలో గంగోత్రి(20), మోనిక(19) అనే ఇద్దరు అమ్మాయిలు స్నేహితులుగా ఉన్నారు. ఇద్దరు కలిసి ఒకరినొకరు తెలియకుండా గంగరాజు (20) అనే యువకుడిని ప్రేమించారు. గంగరాజు-మోనికల పెళ్లి నిశ్చయం కావడంతో గంగోత్రి వారిపై పగపెంచుకుంది. దీంతో ఒక చాకుతో మెనికపై గంగోత్రి దాడి చేసింది. మెడ, చేతికి తీవ్ర గాయాలు కావడంతో దిబ్బూరహళ్లి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మోనికి చికిత్స పొందుతుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని గంగ్రోత్రిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News