Monday, April 29, 2024

చరిత్ర సృష్టించిన రషీద్

- Advertisement -
- Advertisement -
Rashid Khan reaches 400 wickets in T20
టి20లో అరుదైన రికార్డు

అబూధాబి: టి20లలో అఫ్గాన్ బౌలర్ రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 400 వికెట్లు సాధించిన అత్యంత పిన్న వయస్కుడు(23ఏళ్లు)గా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డుతో పాటుగా అత్యంత వేగంగా 400 వికెట్ల మైలురాయిని చేరుకున్న ఘనతను కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు. రషీద్ ఆరేళ్ల వ్యవధిలో 289 మ్యాచ్‌లలో ఈ మైలురాయిని చేరుకున్నాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో మార్టిన్ గుఫ్తిల్‌ను ఔట్ చేయడం ద్వారా రషీద్ అరుదైన 400 టి 20 వికెట్ల క్లబ్‌లో చేరాడు. రషీద్‌కు ముందు డ్వేన్ బ్రావో(553 వికెట్లు), సునిల్ నరైన్ (425), ఇమ్రాన్ తాహిర్ (420) మాత్రమే పొట్టి క్రికెట్‌లో 400 వికెట్ల మార్క్‌ను చేరుకున్నారు. మరో విశేషమేమిటంటే రషీద్ టి20 అరంగేట్రం చేసిన తర్వాత మరే బౌలర్ కూడా ఈ అరుదైన రికార్డును చేరుకోలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News