Saturday, April 27, 2024

జీన్స్ వేసుకుందని…. కొట్టి చంపారు…

- Advertisement -
- Advertisement -

Girl killed by kin for defying no jeans

 

లక్నో: ఓ అమ్మాయి జీన్స్ వేసుకుందని కుటుంబ సభ్యులు కొట్టి చంపిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యుపి చెందిన వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి పంజాబ్‌లోని లూధియానాలో నివసిస్తున్నాడు. అత్తవారి కుటుంబంతో కలిసి ఉండటానికి యుపికి వచ్చారు. వీరి వస్త్రధారణ, ఆహారంపై అత్తవారు కుటుంబ సభ్యులు మండిపడ్డారు. 17 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి జీన్స్, టీషర్ట్ వేసుకుంది, అలాంటి డ్రెస్సులు ధరించొద్దని తాత, ఇతర బంధువులు ఆమెను హెచ్చరించారు. అమ్మాయి వినకపోవడంతో చేతిలో ఉన్న కర్రతో అమ్మాయిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో యువతి చనిపోయింది. కాశ్య-పాట్నా జాతీయ రహదారిలోని పటన్వా వంతెన పైనుంచి మృతదేహాన్ని నదిలో పడేశారు. వంతెనకు మృతదేహం చిక్కుకొని వేళాడుతూ కనిపించింది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు డియోరియా పోలీస్ అధికారి శ్రీపతి మిశ్రా ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాతను అరెస్టు చేయగా పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News