Thursday, May 9, 2024

చిత్తూరులో మానవ అక్రమ రవాణా గ్లోబల్ ‘వాక్ ఫర్ ఫ్రీడమ్’

- Advertisement -
- Advertisement -

మానవ అక్రమ రవాణా గురించి చైతన్యాన్ని పెంచేందుకు చిత్తూరులో ఈ ఉదయం నిర్వహించిన “వాక్ ఫర్ ఫ్రీడం”లో దుర్బల సమూహాల నుంచి, అలాగే లాభాపేక్ష లేని సంస్థల నుంచి 335 మంది పౌరులు పాల్గొన్నారు. ఎస్ఐ శ్రీనివాసులు, వైఎస్ఆర్‪సిపి పార్టీ మండల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపిటిసి మధు, ఆర్‪హెడ్స్ ఎన్‪జిఒ డైరెక్టర్ థియో స్టీపెన్స్, సెయింట్ స్టీఫెన్స్ స్కూల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ప్రకటించేరు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ.. “మన సమాజంలో జరుగుతున్న వాటి అన్నింటి గురించి మనం అందరం బాగా తెలుసుకుని వుండాల్సిన అవసరం వుంది. ఎందుకంటే, ఈ కాలంలో మనుషుల్ని సులువుగా అమ్మేస్తున్నారు అలాగే దోచుకుంటున్నారు. పౌరులందరూ చైతన్యంతో వున్నప్పుడే ఈ నేరాన్ని అరికట్టడానికి వీలవుతుంది. అలాటి చైతన్యానికి దోహదం చేసే వాక్ ఫర్ ఫ్రీడం వంటి ఉద్యమంలో భాగం కావడం నాకు గర్వంగా వుంది” అన్నారు.

చిత్తూరులోను, దేశవ్యాప్తంగానూ ఈ వాక్ లో పాల్గొన్నవారు దీన్ని ప్రారంభించడానికి ముందు, తమజీవిత కాలం ఈ అక్రమ రవాణాని ముగించడానికి తమకున్న అవకాశాల మేరకు అన్నిరకాలుగా వీలైనంత సాయం చేస్తామని ప్రతిజ్ఞ చేసేరు. తరవాత, మానవ అక్రమ రవాణా గురించి సమాచారం, గణాంకాలతో వున్న సింగిల్ ఫైల్ ప్లేకార్డ్స్ పట్టుకుని, ఐరాల అంబేద్కర్ విగ్రహం నుంచి బయల్దేరి అందరికీ కనిపించేలా రోడ్ల మీదుగా తిరిగి అక్కడికే చేరుకున్నారు. మానవ అక్రమ రవాణాలో మౌన బాధితులకి సంఘీభావంగా ఈ వాక్ పూర్తిగా నిశ్శబ్ధ నడకగా సాగింది.

వాక్ ఫర్ ఫ్రీడంలో చిత్తూరు పాల్గొనడం ఇది రెండవ సంవత్సరం, ఎన్‪జిఒ ది మూవ్‪మెంట్ ఇండియా సారథ్యంలో, ఎన్‪జిఒ ఆర్ హెడ్స్ (రూరల్ హెల్త్ ఎడ్యుకేషన్ అగ్రికల్చరల్ అండ్ డెవలప్మెంట్ సొసేటీ) వారి భాగస్వామ్యంతో వారి లబ్ధిదారు సమూహాలు, పాల్గొనే సంస్థ సెయింట్ స్టీఫెన్స్ పబ్లిక్ స్కూల్ వారుకూడా ఇందులో పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (2022) నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 49.6 మిలియన్ మంది ప్రజలు లైంగికంగా, శ్రమ పరంగా, అవయవాలు, పిల్లల్ని అమ్మడం, బలవంతపు పెళ్ళిళ్ళు, ఇంట్లో దాస్యం వంటి రకరకాల దోపిడీలో చిక్కుకుని వున్నారు. అంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి 150 మందిలో ఒకరు బానిసత్వంలో వున్నారు. క్రైమ్ ఇన్ ఇండియా, నేషనల్ రికార్డ్స్ బ్యూరో (2021) నివేదిక ప్రకారం ఇక్కడ భారతదేశంలో 2021లో ప్రతి రోజూ 8 మంది పిల్లలు అక్రమ రవాణాకి గురయ్యేరు.

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో, ఇటుక బడ్డీలు, ఫ్యాక్టరీలు, దుకాణాలు, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు, రెస్టారెంట్లు, మెకానిక్ షెడ్లు, హోటళ్ళలో బాలకార్మికులుగా చిక్కడిపోయివున్న 1013 మంది పిల్లల్ని విజయవంతంగా రక్షించేరు. ‘ఆపరేషన్ స్వేచ్ఛ’ క్రింద యాంటి-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్, ఎన్‪జిఒలు కలిసి ఈ ఏడాది ఫిబ్రవరి, జులై నెలల్లో చేసిన కృషి వల్ల వీళ్ళని రక్షించగలిగేరు. (ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా). ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో వాట్ ఫర్ ఫ్రీడం ని నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరో 25 ఇతర ప్రదేశాల్లోకూడా ప్రజలు ఈ ఉదయం వాక్ ఫర్ ఫ్రీండంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News