Saturday, May 4, 2024

దేశానికే తెలంగాణ అన్నపూర్ణ: గొంగిడి సునీత

- Advertisement -
- Advertisement -

Gongidi sunitha praise KCR ruling

హైదరాబాద్: గత పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ వెనకబడిందని ఆలేరు ఎంఎల్‌ఎ, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తెలిపారు. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన సభలో ధన్యవాద తీర్మానాన్ని గొంగిడి సునీత ప్రతిపాదించారు. తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, దండగ అనుకున్న వ్యవసాయాన్ని సిఎం కెసిఆర్ పండుగలా మార్చారన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ కష్టాలు తీరాయని, ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయని, కరోనా నేపథ్యంలో తెలంగాణ ఆదాయం తగ్గినా కెసిఆర్ ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాన్ని ఆపలేదని, నెల నెల నిధులు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల ఆర్థికస్థితిని మెరుగుపర్చేందుకు అన్ని కుల వృత్తులకు అనేక పథకాలతో నిధులు కేటాయించామని గుర్తు చేశారు.

పరిపాలన వికేంద్రీకరణ కోసం సిఎం కెసిఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని, గిరిజన గూడేలు, తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. సుస్థిర అభివద్ధిలో తెలంగాణ విజయాన్ని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించిందన్నారు. గవర్నర్ ప్రసంగంలో ఈ అంశాన్ని వెల్లడించడం తమకు టానిక్‌లా పని చేసిందని కొనియాడారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఫలితాలను గవర్నర్ ప్రసంగం కళ్లకు కట్టిందని, వలసపోయిన రైతులు తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకునేలా సిఎం కెసిఆర్ సాగు నీరు, ఉచిత విద్యుత్ ఇస్తుండడంతో ఫలితం కనిపిస్తోందన్నారు. దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగిందని సునీత మెచ్చుకున్నారు. ఫ్లోరైడ్‌తో వంకర్లు పోయిన నల్లగొండ జిల్లా మిషన్ భగీరథతో ఆరోగ్యవంతంగా మారిందని, ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందని కొనియాడారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News