Friday, April 26, 2024

రేవంత్ భూచాడే

- Advertisement -
- Advertisement -

Gopanpally land goalmal is true

 

10.20ఎకరాల భూమి దురాక్రమణ, 1.36 ఎకరాల అక్రమ మ్యుటేషన్ నిజమే

రేవంత్ బ్రదర్స్ వాల్టా చట్టాన్నీ ఉల్లంఘించారు, క్రిమినల్ కేసు పెట్టాలి
గోపన్నపల్లి భూతంతుపై ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఆర్‌డిఒ చంద్రకళ

హైదరాబాద్ : ఎంపి అనుముల రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డిలు గోపన్‌పల్లిలోని సర్వే నంబర్127లో అక్రమంగా భూ మ్యుటేషన్‌లు, కబ్జాలకు పాల్పడినట్లు రాజేంద్రనగర్ ఆర్‌డిఒ చంద్రకళ విచారణలో తేలడంతో ఆ నివేదికను మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్‌కు సమర్పించారు. ఎంపి రేవంత్ రెడ్డి , ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి భూ అక్రమాలపై ఆర్‌డిఒ, రెవెన్యూ అధికారులు రేవంత్‌రెడ్డి ఆధీనంలో ఉన్న10.20 ఎకరాల భూమి ఆక్రమించిందేనని ఆర్‌డిఒ తేల్చారు. దీనితో పాటు సర్వే నంబర్127లోనే 5.5 ఎకరాలకు టైటిల్ లేనట్టు విచారణలో గుర్తించారు. ఈ మేరకు గోపన్‌పల్లిలోని సర్వే నంబర్127లో జరిగిన భూగోల్‌మాల్‌కు సంబంధించి ఆర్‌డిఒ ఆ నివేదికలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఎకరం 36 గుంటల భూమిని రేవంత్ బ్రదర్స్ అక్రమంగా మ్యుటేషన్ చేయించుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, ఓల్టాచట్టం ఉల్లంఘించినట్టు సాక్షాలతో తేల్చిన రెవిన్యూ అధికారులు ఓల్టా చట్టం ఉల్లంఘించినందుకు రేవంత్, అతని సోదరునిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే భూమిలో అక్రమంగా కట్టుకున్న గోడలను వెంటనే కూల్చివేయాలని ఆర్‌డిఒ కలెక్టర్‌కు సమర్పించిన నివేదికలో కోరారు. ఇదిలావుండగా గోపన్‌పల్లి గ్రామంలోని సర్వే నంబర్127లో ఉన్న భూమిలో కొంత భాగాన్ని రేవంత్‌రెడ్డి ఆక్రమించారని స్థానికులు ఆరోపించడంతో పాటు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఈ భూమిని ఓ వ్యక్తి నుంచి కొన్నట్టుగా నకిలీ పత్రాలు సృష్టించారని కొందరు, తమ పేరిట మ్యుటేషన్‌చేసినందుకు డబ్బులిస్తామని చెప్పి ఇవ్వలేదని కొందరు ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎంపి రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డిల భూతంతుపై ప్రత్యేక అధికారి ఆర్‌డిఒ చంద్రకళ విచారణలో భాగంగా దాదాపు 60 సంవత్సరాల నాటి భూపత్రాలను సేకరించి, ఆయా భూములకు సంబంధించిన పహాణీలను పరిశీలించిన అనంతరం రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి భూ అక్రమాలు వెలుగుచూశాయని రెవెన్యూ అధికారులు వివరిస్తున్నారు.

రేవంతు భూతంతుపై విచారణ సాగిందిలా..
శేరిలింగంపల్లి మండలంలోని గోపన్‌పల్లి గ్రామంలోని సర్వే నం 127లో ఎంపి రేవంత్‌రెడ్డి, అతని సోదరుడు కొండల్‌రెడ్డిలపై వచ్చిన ఫిర్యాదులపై ఆర్‌డిఒ చంద్రకళ, ఇతర అధికారుల బృందం మూడు రోజుల పాటు అన్ని కోణాలలో విచారణ చేపట్టారు. అక్రమణకు గురైందన్న భూమి వివరాలను పూర్తిస్థాయిలో సేకరించడంతో పాటు విచారణ చేశారు. గోపన్‌పల్లి భూముల వ్యవహారంలో అక్రమణకు గురైన భూములు చేతులు మారిన విషయంపై విచారణ చేపట్టడంతో పాటు గ్రామంలో పలువురిని విచారించారు. ఈ క్రమంలో గోపన్‌పల్లి గ్రామంలోని సర్వే నం 127లో 10.21 ఎకరాల భూమి 1977వరకు వడ్డె హనుమయ్య,అతని వారసుడు వడ్డె మల్లయ్య పేరు మాద ఉన్నట్లు రికార్డుల్లో నమోదైట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. కానీ 1978 నుంచి ఈ భూమి మల్లయ్య పేరు మీద పహణిలో నమోదవుతూ వచ్చింది.

మల్లయ్య పేరు ఉంది కానీ ఆయన ఇంటి పేరు లేదు.1993,1994 నుంచి ఈ భూమికి దబ్బ మల్లయ్య అని రెవెన్యూ రికార్డుల్లో నమోదు అవుతూ వచ్చింది.దబ్బ మల్లయ్య పేరును నమోదు చేయాడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ 2001,2002 నుంచి పహాణిల్లో తొలగించారు. 2005లో అప్పటి శేరిలింగంపల్లి డిప్యూటి ఇ.మల్లయ్య కు వారసుడిగా చెపుకునే ఇ.లక్ష్మయ్య పేరు మీద 2 ఎకరాల 21 గుంటల భూమిని రాశారు.ఆ భూమి లక్ష్మయ్య కాస్తులో ఉన్నట్లు తేల్చేశారు.అదే తహసీల్దార్ మళ్లీ వివరాలను సవరిస్తూ లక్ష్మయ్య పేరు మీద మొదట 2కరాల 21 గుంటలను రాయడం,మళ్లీ సవరించి ముప్పై ఒకటిన్నర గుంటలకు మార్చడం రెండూ తహసీల్దార్ తన అధికార పరిధిని అతిక్రమించారని ఆర్‌డిఓ విచారణలో తేలింది. ఇలా అక్రమంగా లక్ష్మయ్య పేరు మీద రికార్డుల్లో నమోదైన ముప్పై ఒకటిన్నర గుంటల భూమిని అనుములు రేవంత్‌రెడ్డి కొనుగోలు చేసినట్లు సేల్ డీడ్ రాసుకున్నారు.

ఇ.లక్ష్మయ్యకు ఎలాంటి పట్టదారు హక్కులు లేనప్పటికి అతని నుంచి భూమిని కోనుగోలు చేసినట్లు చేసుకున్న సేల్ డీడ్ ఆధారంగా వ్యవహరించారు. రేవంత్‌రెడ్డి పేరును ఈ భూమికి హక్కు దారుడిగా పేర్కొంటూ 2005లో అప్పటి తహసీల్దార్ రికార్డుల్లో నమోదు చేశారు.ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు లేకుండానే ఇ.లక్ష్మయ్య ఒక ఎకరం 29 గుంటల భూమిని రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డికి అమ్మాడు.అధికారులు ఆ కొనుగోలు ప్రకారం కొండల్‌రెడ్డి పేరిట 2015లో మ్యుటేషన్ చేశారు.మరోవైపు ఎలాంటి ఆధారాలు లేకున్నప్పటికి తన పేరు మీద ఉన్న డాక్యుమెంట్ల ద్వారా డి.మల్లయ్య అనే వ్యక్తి 2 ఎకరాల 20 గుంటల హైమిని కళావతి అమ్మాడు.ఈ భూమిని కూడా అధికారులు కళావతి పేరు మీదకి బదిలిచేశారు.(మ్యూటేషన్ )ఆ తర్వాతా ఆభూమిని కళావతి నుంచి అనుముల కొండల్‌రెడ్డి పేరు మీద బదలాయించారు.

ఇంకోవైపు 1989లో ఎ.వెంకటరెడ్డి అనే వ్యక్తి దబ్బ మల్లయ్య పేరు మీద భూమి ఉన్నట్లు రికార్డుల్లో లేదు.వెంకటరెడ్డి ఈ భూమిలో ని 13 గుంటల భూమిని తర్వత ఎ.కొండల్‌రెడ్డి పేరు మీదకు అక్రమంగా బదిలీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. గోపన్ పల్లి సర్వే నెనం 127లో గల భూమికి సంబందించి తమకుహక్కు ఉందని,అనుములు రేవంత్‌రెడ్డి ఈ భూములును అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కొల్లా అరుణ 2017లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన వివరాలను అధికారులు విచారణలో భాగంగా సేకరించారు.

బాధితులకు ఊరట ః
గోపన్‌పల్లి బాధితుల వినతిప్రతంపై మూడు రోజుల్లోనే ఆర్‌డిఒ చంద్రకళ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టడం, విచారణలో రేవంత్ బ్రదర్స్ అక్రమాలు వెలుగుచూడటంతో బాధితులకు ఊరట లభించింది. గోపన్‌పల్లి సర్వే నం.127లో రేవంత్ రెడ్డి, అతని సోదరులు బెదిరించి అక్రమంగా తమ భూములలో ఉన్న రాళ్లను , ఫెన్సింగ్‌ను జెసిబి తొలగించారని గోపన్ పల్లి భాదితులు కల్లం పెరిరెడ్డి, కోల గురువారెడ్డి లు రాజేంద్రనగర్ ఆర్‌డిఒ చంద్రకళను కలిసి వినతి పత్రం సమర్పించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో గోపన్‌పల్లి భూ బాధితులు సర్వే నం 127లో కోల గురువారెడ్డి పేరున అతని భార్య కోల అరుణ, వారి బందువులపేరున మొత్తం నాలుగు వేల ఎనిమివందల గజాల భూమి ఉందని ఆర్‌డిఒ విచారణలో తేలింది. బాధితులకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుంటామని ఆర్‌డిఒ చంద్రకళ మీడియాతో పేర్కొన్నారు.

Gopanpally land goalmal is true
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News