Monday, April 29, 2024

60 లేదా 61

- Advertisement -
- Advertisement -

Retirement Age Increase

 

రిటైర్మెంట్ వయసు పెంపుపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన?

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచనున్నట్లు తెలిసింది. ఈ మేర కు త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సమావేశా ల్లో ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెల్లడించనున్న ట్లు సమాచారం. ఇప్పటికే బడ్జెట్‌పై రూపకల్ప న తుది దశకు చేరుకుంది. ఇటీవల ముఖ్యమం త్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో 202021 బడ్జెట్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా బడ్జెట్‌లో ప్రధానంగా 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై దృష్టిసారించినట్లు ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఆసరా వంటి పెన్షన్‌లను ఇచ్చిన హామీ మేరకు పెంచారు. ఎకరాకు రూ. 5 వేల చొప్పున రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇలా మేనిఫెస్టోలో పెట్టిన హామీ ల్లో కొన్నింటిని గత బడ్జెట్‌లోనే అమలుకు రూపం ఇచ్చారు.

ఈ క్రమంలో ఉద్యోగులకు వేతన సవరణ(పిఆర్‌సి), పదవీ విరమణ వయస్సు పెంపు వంటివి ఉన్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతామని మేనిఫెస్టోలో టిఆర్‌ఎస్ చెప్పింది. అయితే 60 ఏళ్లు చేయలా లేక 61 ఏళ్ల చేయాలా అనేదానిపై తుది నిర్ణయం జరగలేదని తెలిసింది. 61 ఏళ్లకు పెంచితే దాదాపు 26 వేల మంది ఉద్యోగులకు మూడేళ్ల అదనపు సర్వీసు లభించనుంది. తద్వారా ప్రభుత్వానికి కొంత ఆర్థిక ఉపశమనం కలగనుంది. కంటి వెలుగు పథకం మాదిరిగానే ఇతర ఆరోగ్య పరీక్షల కోసం వైద్య శిబిరాల ఏర్పాటు, ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసి, తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపొందించడం వాటికి ఈసారి బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నారు. రైతులకు లక్ష రూపాయల వరకూ పంట రుణాల మాఫీ చేస్తామని రూ.6 వేల కోట్లు ప్రస్తుత బడ్జెట్‌లో ప్రతిపాదించారు.

అయితే ఇంతవరకు రుణమాఫీకి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదు. రానున్న బడ్జెట్‌లోనూ రూ.6 వేల కోట్ల వరకు రుణమాఫీ కోసం ప్రతిపాదిస్తున్నారు. ఇక డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంకు సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు, ఎస్‌సి, ఎస్‌టిలకు రూ. 6 లక్షల సాయం చేసేందుకు నిధులు కేటాయించనున్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బడ్జెట్‌లో నిధులు ప్రతిపాదిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వాటి నిర్వహణ బాధ్యతను మహిళ సంఘాలతో కలిపి, ఐకెపి ఉద్యోగులకు అప్పగించే ప్రతిపాదన ప్రభుత్వం దృష్టిలో ఉంది. నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే విషయమై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.

Statement at Assembly on Retirement Age Increase
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News