Home తాజా వార్తలు ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై సమీక్ష

ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై సమీక్ష

హైదరాబాద్: తెలంగాణలో మహమ్మారి కరోనా పరిస్థితులపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో చేస్తున్న కరోనా పరీక్షలు, చికిత్స, బిల్లులు, ఆస్పత్రుల్లో పడకలు వంటి విషయాలపై గవర్నర్ తమిళిసై సమీక్షిస్తున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు ఆస్పత్రుల ప్రతినిధులు హాజరయ్యారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య ఇప్పటికే 25వేలకు చేరుకుంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Gov Tamilisai video conference with private hospitals