Monday, April 29, 2024

ప్లాస్మా డొనేట్ చేయండి: గవర్నర్ తమిళిసై

- Advertisement -
- Advertisement -

Governor Tamilisai visits ESI Hospital

హైదరాబాద్: సనత్ నగర్ ఈఎస్ఐ మెడికల్ కాలేజిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ సందర్శించారు. ఈ సందర్భంగా కరోనా ట్రీట్మెంట్, వసతులపై అధికారులతో గవర్నర్ తమిళిసై మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. ‘ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ జరగాలి. ప్లాస్మా దానం వల్ల కరోనా బాధితుల ప్రాణాలు కాపాడవచ్చు. కరోనా నుంచి కోలుకున్నావారు ముందుకు వచ్చి ప్లాస్మా డొనేట్ చేయండి. ప్లాస్మా డోనర్స్ ఈఎస్ఐ ఆస్పత్రిలో సమాచారం ఇవ్వాలి. ఐసిఎంఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్లాస్మా బ్యాంక్ కు సహకరించాలి. అయితే, అందరూ ప్లాస్మాను దానం చేసేందుకు అవకాశం లేదని, వైద్యులు నిర్ధారించినవారి నుంచే ప్లాన్మా సేకరిస్తారు. ప్లాస్మా డోనర్స్‌ని ఒక వేదిక మీదకు తీసుకురావాలి. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ప్లాస్మా థెరఫీకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. కరోనా వైరస్‌తో ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదు. అందరూ రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి’ అని పేర్కొన్నారు.

Governor Tamilisai visits ESI Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News