Saturday, April 27, 2024

జులై 26న నితిన్ పెళ్లి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యంగ్ హీరో నితిన్ తను ప్రేమించిన షాలినిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఏప్రిల్ నెలలో అభిమానులు, సినీ ప్రముఖుల మధ్య పెళ్లి చేసుకోవాలనుకున్న నితిన్ కు కరోనా అడ్డుపడింది. దీంతో సైలెంట్ అయిన నితిన్.. ఇప్పట్లో కరోనా తగ్గేటట్లు కనిపించకపోవడంతో కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. తాజా సమాచారం ప్రకారం జులై 26న హైద‌రాబాద్‌లో రాత్రి 8:30 గంట‌ల‌కు నితిన్, షాలిని వివాహ బంధంతో ఒకటి కానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఫిబ్ర‌వ‌రిలో నితిన్‌, షాలిని ప‌సుపు కుంకుమ వేడుక జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇక, సినిమాల విషయానికి వస్తే.. ప్ర‌స్తుతం నితిన్ ‘రంగ్ దే’ సినిమాతోపాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ మూవీ, మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ‘అంధాధున్’ రీమేక్‌, కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ‘ప‌వ‌ర్ పేట’ సినిమాలు చేయ‌నున్నారు.

Nithin-Shalini wedding on July 26th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News