Thursday, May 9, 2024

పాజిటీవ్ వచ్చిందని చెప్పినా పట్టించుకోని అధికారులు.. సిఎం ఇంటిముందు బాధితుడు..

- Advertisement -
- Advertisement -

Corona positive man walks to Karnataka CM's house

బెంగళూరు: కరోనా పాజిటీవ్ వచ్చిన ఓ వ్యక్తి పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెంది శంకర్ అనే వ్యక్తి తనకు కరోనా పాజిటీవ వచ్చిందని సమాచారమిచ్చినా అంబులెన్స్ రాలేదు. దీంతో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. కరోనా వస్తే ఇక్కడికెందుకు వచ్చావ్.. ఆస్పత్రికి వెళ్లంటూ ఉచిత సలహా ఇచ్చారు. దీంతో కటుంబ సభ్యులతో కలిసి బాధితుడు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి చేరుకొని తన బాధను సిఎంఒ అధికారులకు చెప్పుకున్నాడు. తనకు సహాయం చేయాలని అధికారులను కోరాడు. స్పందించిన అధికారులు బాధితుడిని, అతని కుటంబ సభ్యులను వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కర్ణాటకలో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థంచేసుకోవచ్చు. కాగా, దేశంలో ఎక్కువ కేసులు బెంగళూరు, హైదరాబాద్, పుణెలల్లోనే నమోదవుతున్న అధికారులు పేర్కొంటున్నారు.

Corona positive man walks to Karnataka CM’s house 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News