Sunday, May 12, 2024

గ్రీవెన్స్ అర్జీలకు త్వరగా పరిష్కారం చూపాలి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : దరఖాస్తుదారుల వినతులను వీలైనంత త్వరగా పరిష్కార మార్గం చూపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో అర్జీదారుల నుండి స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు తగు చర్య నిమిత్తం సిఫరస్ చేశారు. సోమవారం గ్రీవెన్స్ డేను రద్దు చేస్తున్నామని అధికారికంగా ప్రకటించినప్పటికి జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు భారీగా తరలిరావడంతో వారి నుంచి ఆర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా తిరుమలాపురం గ్రామం చింతకాని మండలంకు చెందిన రావుట్ల వెంకటాచారి తనకు వృద్ధాప్య పింఛను మంజూరు చేయగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్య నిమిత్తం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని ఆదేశించారు. కామేపల్లి మండలం బర్లగూడెం గ్రామ పంచాయితీలో నిర్మించిన సిసి రోడ్లు నాణ్యత లేకుండా నిర్మించడం జరిగిందని అట్టి పనులపై విచారణ జరిపించగలరని గ్రామ ఉప సర్పంచ్ బానోతు బాబు సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం పంచాయితీరాజ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ కు సూచించారు.

నేలకొండపల్లి మండలంకు చెందిన పి.రమేష్ మండలంలో నిబంధలకు విరుద్దంగా వైన్స్ షాపు నడిపిస్తు అధిక ధరలకు మధ్యం విక్రయిస్తున్నారని అట్టి వారిపై చర్యలు తీసుకో గలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగలి, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News