Saturday, April 27, 2024

పిచ్చోడి చేతిలో రాయి.. రేవంత్ రెడ్డి చేతిలో కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : పిచ్చోనా చేతిలో రాయి. రేవంత్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ పార్టీ బందీ అయ్యిందని లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగులోతు భీమా నాయక్ అరోపించారు. బెల్లయ్యనాయక్‌కు కాంగ్రెస్ టికెట్ రాకుండా అడ్డుపడుతున్న లంబాడి జాతి వ్యతిరేకులు రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కలను బరాబర్ ఓడించి లంబాడీల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలో సంఘం నాయకులతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో నిన్న కాక మొన్న వచ్చిన కార్పోరేట్ రాజకీయ నాయకులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏజెంట్లకు అత్యధిక సీట్లు ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. జీవితాన్ని త్యాగం చేసి పార్టీ పెరుగుదల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ఆశావహులకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్పోరేట్ కత్తి వారి జీవితాలను బలి తీసుకుంటుందన్నారు.

కెసిఆర్ మీద ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు, రాష్ట్రంలో గాలి వీస్తుందని అనుకుంటూ పొరపాటే అని పేర్కోన్నారు. కాంగ్రెస్ జాతీయ నేత బెల్లయ్య నాయక్‌కు టికెట్ ఇవ్వకపోతే.. లంబాడీలు తలచుకుంటే రేవంత్, పొంగులేటి, సీతక్కలను ఓడించక తప్పదని హెచ్చరించారు. గత మూడు దశాబ్దాలుగా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్న బెల్లయ్యనాయక్‌కు చరిత్ర కలిగి ఉన్నారన్నారు. గత 12 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం పనిచేసిన ఉన్నత విద్యావంతుడు బెల్లయ్యనాయక్ అని పేర్కోన్నారు. ఆయనకు టిక్కెట్ రాకుండా అడ్డుపడుతున్న రెండు శాతం ఉన్న ఫ్యూడల్ భావజాలంతో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్‌రెడ్డి ఏ సమయంలో ఎలా మాట్లాడాలో తెలియని అహంకారి అని ద్వజమెత్తారు. తన స్వార్ధం కోసం కార్పోరేట్ సామ్రాజ్యం కాపాడుకోవడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లలో కొనసాగి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేసిన వారికి టికెట్లు రాకుండా అడ్డుకుంటున్నారని శ్రీనివాస్‌రెడ్డి వైఖరిపై ఆయన మండిపడ్డారు.

అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బెల్లయ్యనాయక్ లాంటి వారు గెలిస్తే తనకు మంత్రి పదవి రాదనే అక్కసుతోనేబెల్లయ్యనాయక్‌కు పార్టీ టికెట్ రాకుండా అడ్డుకుంటూ కుట్రపన్నుతుందని సీతక్కపై విరుచుకుపడ్డారు. సీతక్కకు లంబాడీలు ఒక్క ఓటు రాకుండా తాము సత్తాచాటుతామన్నారు. లండాడీల జనాభా తెలంగణలో 40 లక్షలమంది ఉన్నారని మేము తలచుకుంటే 40 ఎమ్మెల్యే స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించితీరుతామని ప్రకటించారు. రాష్ట్రంలో 9 లక్షల మంది ఉన్న ఆదివాసీలకు ఆరు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు. 40లక్షల మంది లంబాడీలకు నాయకత్వం వహిస్తున్న బెల్లయ్యనాయక్‌కు ఎందుకు పార్టీ టికెట్ కేటాయించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన కోరం కనకయ్యకు తిరిగి కాంగ్రెస్‌లోకి రాగానే పార్టీని మోసం చేసిన ఆయనకు ఎలా టికెట్ ఇస్తారని నిలదీశారు. కాంగ్రెస్‌ను, రేవంత్‌రెడ్డిని ఇష్టానుసారంగా తిట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మళ్లీ పార్టీలోకి తీసుకుని టికెట్ కేటాయిస్తారు, అన్ని పార్టీలు తిరిగి వచ్చిన పొంగులేటికి పార్టీ టికెట్ కేటాయిస్తారు..

కానీ బెల్లయ్యనాయక్ లాంటి బలమైన నాయకుడికి మాత్రం పార్టీ గుర్తించి టికెట్ ఎందుకు ఇవ్వరని నిలదీశారు. వెయ్యి రూపాయలు ఇచ్చి గుడుంబా పోస్తే ఓట్లు వేస్తారని లంబాడీలను రేవంత్ రెడ్డి కించపరిచారని అలాంటి రాజకీయ నీచుడికి కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడిగా కొనసాగే అర్హత లేదని భీమానాయక్ ఆరోపించారు. ఈ సమావేశంలో వాంకుడోత్ మంగీలాల్, కర్నావత్ గాంధీ నాయక్, రాందాస్ నాయక్, గుగులోతు శివ వర్మ, బానోతు విష్ణునాయక్, గుగులోతు మంగీలాల్ నాయక్, బొజ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News