Wednesday, May 1, 2024

జిమ్నాస్టిక్ క్రీడాకారిణిని కలిసిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్

- Advertisement -
- Advertisement -

Gymnastic player buddha reddy meet with telangana sports chairman

ఢిల్లీ: చిన్న వయసులోనే జిమ్నాస్టిక్ క్రీడాకారిణి బుద్ధ అరుణ రెడ్డి తన తండ్రిని కోల్పోయిందని, రెండు సార్లు జిమ్నాస్టిక్ క్రీడలో పెద్ద గాయాల నుండి కోలుకుంది అని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి తెలియజేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ కు చెందిన జిమ్నాస్టిక్ క్రీడాకారిణి బుద్ధ అరుణ రెడ్డి ని అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి హర్యానా రాష్ట్రం లోని అంబాల లో గల వార్ హీరోస్ మెమోరియల్ స్టేడియం లో కలిశారు. హర్యానా రాష్ట్రం లోని అంబాల పట్టణం ఢిల్లీ నుండి 230 కిలోమీటర్ల దూరంలో కలదు.

జపాన్ లో వచ్చే నెల అక్టోబర్ 18 వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఈవెంట్ లో టోర్నమెంట్ పోటీల్లో పాల్గొనడానికి ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు గల ఇండియన్ టీం లో వచ్చే నెల అక్టోబర్ 12 వ తేదీన జపాన్ కు వెళుతున్నారు

ఈ సందర్భంగా ఛైర్మన్ గారు బుద్ధ అరుణ రెడ్డి కి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

బుద్దా అరుణ రెడ్డి గతంలో వరల్డ్ చాంపియన్‌షిప్ లో మెడల్ సాధిస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రెండు కోట్ల ఆర్థిక సహాయం చేశారని ఈ సందర్భంగా ఛైర్మన్ తెలిపారు.

మళ్లీ వరల్డ్ ఛాంపియన్‌షిప్ కి ఎంపిక కావడం తెలంగాణకు గర్వ కారణం అని, రానున్న రోజుల్లో ఏషియన్ గేమ్స్ కి, కామన్వెల్త్ గేమ్స్ కి, ఒలింపిక్ గేమ్స్ కి ఎంపిక అయి మెడల్ సాధించే ఆస్కారం ఉంది అని ఛైర్మన్ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కోచ్‌లు మనోజ్ రాణా, సత్ పాల్ చబ్రూ, పారమౌర్ సింగ్, శ్రీమతి.అంజు దువా (అర్జున అవార్డు గ్రహీత) తదితరులు క్రీడాకారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News