Monday, May 6, 2024

రాష్ట్రంలోనే తొలి క్రైస్తవ భవన్ సిద్దిపేటలోనే

- Advertisement -
- Advertisement -

Harish Rao Participated In Christmas Celebrations

సిద్దిపేట: రాష్ట్రంలోనే తొలి క్రైస్తవ భవన్ నిర్మాణం సిద్దిపేటలోనే నిర్మాణమైందని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కొండా భూదేవి ఫంక్షన్ హాల్‌లో జరిగిన క్రిస్మస్ సంబురాలకు ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే సిఎం కెసిఆర్ ముఖ్య లక్షమన్నారు. అందరి పండుగలను గౌరవించి అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దేనని అన్నారు. ఏ మతం వారైనా సరే ముందు భారతీయులేనన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలన్నదే రాష్ట్ర సర్కార్ ధ్యేయమన్నారు. సిఎం ప్రత్యేక చొరవతోనే హైదరాబాద్‌లో క్రిస్టియన్ భవన్ నిర్మాణమైందన్నారు. చర్చిల నిర్మాణాలు, మరమ్మతులకు రాష్ట్ర సర్కార్ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని అన్నారు. కరోనాతో అన్ని వర్గాలకు సంబంధించిన పండుగలను సరిగ్గా జరుపుకోలేదని అన్నారు. కరోనాను అరికట్టడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి అన్ని విధాల కృషి చేస్తున్నారన్నారు.

క్రిస్టియన్ విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందించడానికి ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్లను స్థాపించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. అలాగే విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించడానికి రూ. 20 లక్షలు ప్రభుత్వ పరంగా అందిస్తున్నారన్నారు. షాదీ ముబారక్ ద్వారా నిరుపేద యువతుల వివాహలకు ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా నిరుపేద క్రిస్టియన్లకు క్రిస్‌మస్ పండుగ సందర్భంగా దుస్తులను అందిస్తుంది టీఆర్‌ఎస్ సర్కార్ మాత్రమేనన్నారు. జిల్లాలోని చర్చిల నిర్మాణ, మరమ్మతులకు ప్రభుత్వ పరంగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. స్వచ్ఛసిద్దిపేటలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. నిరుపేదల క్రిస్టియన్లకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లలో చోటు కల్పిస్తామన్నారు.

ఆలస్యమైనా.. అర్హులందరికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు దక్కాలన్నదే ముఖ్య లక్షమన్నారు. అనంతరం కేక్ కట్‌చేసి క్రిస్‌మస్ సంబురాలను మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేదల క్రిస్టియన్లకు ప్రభుత్వం పరంగా దుస్తులను మంత్రి చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీఎండబ్లూవో జీవరత్నం, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ప్రజాప్రతినిధులు, నాయకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, వేలేటి రాధాకృష్ణశర్మ, అబ్దుల్ మోయీజ్, సాకి ఆనంద్, జావిద్, చిప్ప ప్రభాకర్, రాజనరేందర్, మల్లికార్జున్, నాగరాజురెడ్డి, క్రైస్తవ మత పెద్దలు అశోక్, సత్యానందం, జోషి, రాజరత్నం తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News