Monday, April 29, 2024

కరోనా వ్యాక్సిన్ కోసం కోల్డ్ చైన్ స్టోరేజీలు సిద్దం

- Advertisement -
- Advertisement -

Cold Storages is Ready for Covid-19 vaccine

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వ్యాక్సిన్ ఆరోగ్య కార్యకర్తలు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్దం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి లక్షమంది సిబ్బంది ఉన్నట్లు, అందులో మొదటి దశలో 42వేల మందికి టీకాను ఇవ్వనున్నారు. ఇప్పటికే నగరానికి సిరంజిలు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం నగరంలో కోటి జనాభా ఉండటంతో అందరికి సరిపోయేలా వ్యాక్సిన్ పంపనున్నట్లు పేర్కొంది. దీంతో అధికారులు వాటిని నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజీ చైన్ సిస్టిమ్‌ను అధికారులు ముమ్మరం చేస్తున్నారు. నగరంలో 5500 వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో కేంద్రంలో వెయ్యి మందికి చొప్పన టీకా ఇచ్చేలా తగిన సదుపాయాలను, సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో నగర ప్రజలందరికి టీకా ఇచ్చేలా ప్రణాళికలు చేశారు. మొదటి డోస్ తీసుకున్నవారికి నాలుగు వారాల తరువాత రెండో డోస్ ఇవ్వాల్సి ఉండటంతో రెండునెలల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్ నగరంలో 284 క్యూబిక్ మీటర్లు సామర్దం కలిగిన వాటిని నెలకొల్పాలని భావిస్తూ వైద్యసేవలు,మౌలిక సదుపాయాల సంస్ద ద్వారా రూ. 3 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడిస్తున్నారు. అదే విధంగా ప్రీజర్లు, వ్యాక్సిన్ కూలర్లు, డిప్‌ప్రీజ్ బాక్సులు కేంద్రం అందజేస్తుంది. వ్యాక్సిన్‌ను ఎఎన్‌ఎంలు ప్రజల వద్దకు తీసుకెళ్లనున్నట్లు, 3600మందిని టీకా కోసం విధులు నిర్వహించనున్నారు. వ్యాక్సిన్ ఏవిధంగా వేయాలనే అంశంపై వారికి శిక్షణ ఇస్తున్నట్లు, మూడు రోజులో ట్రైనింగ్ పూర్తి చేసుకుని వారంతా తమ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తారని, వ్యాక్సిన్ వేసే సమయంలో సెలవులు పెట్టవద్దని సూచించారు. కరోనా బారిన పడవారిని, 15ఏళ్లలోపు పిల్లలను మినహాయించి, మిగతవారికి టీకా ఇచ్చేందుకు వైద్యశాఖ జాబితా సిద్దం చేసింది. మరోపక్క మొదటి వ్యాక్సిన్ గాంధీ ఆసుపత్రికి చెందిన నర్సులకు ఇవ్వాలని, కోవిడ్ రోగులకు ప్రారంభం నుంచి చికిత్సలు అందిస్తున్నారు.

వైద్యుల కంటే ఎక్కువ సమయం కేటాయించి ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహించి,లక్షలాదిమంది రోగులకు ఊపిరి పోశారు.దీంతో మొదటి టీకా నర్సులకు ఇస్తే వారికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని పేర్కొంటున్నారు. అదే విధంగా టీకా ఇవ్వడానికి ముందు ప్రజల ఆరోగ్యానికి సంబంధించి తెలుసుకోవాల్సిన ప్రశ్నలు సిబ్బందికి ప్రిపేర్ చేస్తున్నారు. దీంతో ఆరోగ్య పరిస్దితి తెలుసుకుని ఏవిధంగా వైద్యం అందించాలో వెంటనే గుర్తించవచ్చంటున్నారు. టీకా రెండు డోసులు తీసుకున్నాక సమస్యలు వస్తే వైద్య సిబ్బందికి వివరాలు తెలిపేందుకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు వైద్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News