Saturday, April 27, 2024

తెలంగాణ కురుక్షేత్రంలో కౌరవుల పార్టీ కాంగ్రెస్ ఓటమి ఖాయం: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: తెలంగాణలో జరగబోయే కురుక్షేత్రంలో కౌరవుల పార్టీ కాంగ్రెస్ ఓటమి ఖాయమని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు జోస్యం చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో సిద్ధిపేట, దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని 7200 మంది మత్స్యకారులకు మంత్రుల చేతుల మీదుగా గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. “మహాభారతంలో కౌరవులు ఎక్కడా గెలువరు. ధర్మం పాటించిన పాండవులే గెలుస్తారు.. రేపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే కురుక్షేత్రంలో గెలిచేది ధర్మమే. కాంగ్రెస్ కౌరవుల పార్టీ. అభివృద్ధి గెలవాలా..? అబద్ధం గెలవాలా.? అనే రెండింటి మధ్యే పోటీ ఉంది. ఏన్నో అద్భుతమైన విజయాలకు, దేశానికే దిక్సూచిగా తెలంగాణ.

పూటకొక దొంగ డిక్లరేషన్ చేసే కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మరు. మూడవ సారి కూడా సీఎం కేసీఆర్ అని తెలంగాణ ప్రజలు సెల్ఫ్ డిక్లరేషన్ చేశారు. హైదరాబాదులో కాంగ్రెస్ ఏఐసీసీ మీటింగ్ పెడ్తదట. ఇక అన్నీ అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. 60 ఏళ్లు పాలించి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదో కాంగ్రెస్ పార్టీ ముందు సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. గతంలో మత్స్యకారులకు సభ్యత్వం దొరకడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు. దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గ గంగపుత్రులకు రాష్ట్రంలోనే మొదటిసారి గుర్తింపు కార్డులు సిద్దిపేటలో ఇవ్వడం సంతోషంగా ఉంది. గుర్తింపు కార్డులతో అన్నీ రకాల ఉపయోగం ఉంటుంది. కోరిన వెంటనే నిర్ణయం తీసుకుని రాష్ట్రమంతా ఇద్దామని, సిద్ధిపేటతో 8 వేల మందికి కార్డులు పంపిణీతో కార్యక్రమం ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కృతజ్ఞతలు.

దేశంలోనే ఎక్కడా లేని విధంగా 2 వేల కోట్ల రూపాయలతో మత్స్యకారుల సంక్షేమానికి ఖర్చు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ హయాంలో కొన్ని చెరువులలో సబ్సిడీపై చేప పిల్లలు వేసేవారు, రాష్ట్రంలోని అన్నీ చెరువులలో ఉచితంగా వంద శాతం సబ్సిడీతో మనమే ఇస్తున్నాం. గతంలో చేపలు దిగుమతి అయ్యేవి. మృగశిర కార్తె వస్తే పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకునే పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణలో సీన్ రివర్స్ అయ్యింది.. పుష్కలంగా చేపలు వచ్చినయ్. మిషన్ కాకతీయతో నీళ్ల కరువు లేదు. ఇవాళ నీళ్లు ఫుల్, చేపలు కరువు లేదు. చేపలు ఫుల్ వచ్చినయని, గంగపుత్రుల జీవితంలో వెలుగులు నిండాయి. సిద్దిపేట నుంచి విజయవాడ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ కు చేపలు ఎగుమతి అవడం గర్వ కారణం” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News