Saturday, April 27, 2024

వదిలితే ఇప్పుడే దున్నేసేలా ఉన్నాడు..

- Advertisement -
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంగళవారం కుటుంబంతో కలిసి హోలీ వేడుకలలో పాల్గొన్నాడు. ట్విట్టర్ వేదికగా అందరికీ హోలీ శుభాకాంక్షలు కూడా చెప్పాడు. అలాగే తన క్యూట్ ఫ్యామిలీ ఫోటోని ఆయన షేర్ చేశాడు. ఈ ఫొటోలో భార్య లక్ష్మీ ప్రణతితో పాటు, పెద్ద కొడుకు అభయ్ రామ్, చిన్న కొడుకు భార్గవ్ రామ్ కూడా ఉన్నారు. రెండేళ్లు కూడా నిండని భార్గవ్ రామ్ స్మైలింగ్ ఫేస్‌తో చక్కగా కెమెరాకు పోజిచ్చాడు. ఈ ఫోటో ట్యాగ్ చేస్తూ దర్శకుడు హరీష్ శంకర్ ఆసక్తికరంగా స్పందించాడు. చిన్నబ్బాయి కెమెరా వైపు చూస్తున్న తీరు చూస్తుంటే ‘వదిలితే ఇప్పుడే దున్నేసేలా ఉన్నాడు’ అని కామెంట్ పెట్టాడు. భార్గవ్ భవిష్యత్ లో పెద్ద హీరో అవుతాడని అర్థమైపోతుంది అనే భావనలో హరీష్ కామెంట్ పెట్టడం జరిగింది. ఇక గతంలో హరీష్… ఎన్టీఆర్‌తో ‘రామయ్య వస్తావయ్యా’ సినిమాను తెరకెక్కించాడు.

Harish Shankar tweet on Jr NTR’s Family Holi Photo

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News