Sunday, May 12, 2024

ఈనెల 31 వరకు థియేటర్ల మూసివేత..

- Advertisement -
- Advertisement -

కరోనా కలకలంతో ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. రోజురోజుకి కరోనా బాధితులు ఎక్కువైపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళలో సినిమా థియేటర్లను కొన్ని రోజుల పాటు బంద్ చేయబోతున్నారు. కేరళలో కరోనా వైరస్ కారణంగా బుధవారం నుంచి ఈనెల 31 వరకు సినిమా థియేటర్లు మూసివేయబడనున్నాయి. కొచ్చిలో జరిగిన వివిధ మలయాళ సినీ సంస్థల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పటికే కరోనా ప్రభావం వల్ల దేశంలోని పలు ప్రాంతాల్లోని థియేటర్లు కలెక్షన్లు లేక వెలవెలబోతున్నాయి.

Corona Effect: Theaters closed in Kerala till March 31st

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News